విశాఖలో కిడ్నాప్ కలకలం

విశాఖ గోపాలపట్నం పీఎస్ పరిధిలో కిడ్నాప్ కలకలం రేపింది. కాకినాడకు చెందిన తరుణ్ అనే వ్యక్తి మరి కొంత మంది రౌడీషీటర్లతో కలిసి.. అమలాపురానికి చెందిన ముగ్గరు వ్యక్తులను కిడ్నాప్ చేశారు. వారిని లాడ్జిలో మూడు రోజుల పాటు బంధించి చిత్రహింసలకు గురి చేశారు. ముగ్గురు బాధితుల్లో ఒకరైన జగదీష్ అనే యువకుడు ఫోన్ ద్వారా పోలీసులకు సమాచారం ఇవ్వడంతో.. కిడ్నాప్ గుట్టు రట్టైంది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పరారైన నిందితుల కోసం గాలిస్తున్నారు. కిడ్నాప్‌కు ఆర్థిక లావాదేవీలే ప్రధాన కారణమని తెలుస్తోంది.
Next Story