విజయవాడలో బీజేపీ నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన కిషన్ రెడ్డి

విజయవాడలో బీజేపీ నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన కిషన్ రెడ్డి
ప్రపంచంలో అతిపెద్ద పార్టీ బీజేపీ అని... ప్రధాని మోదీ నాయకత్వంలో దేశం అభివృద్ధి చెందుతుందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌ రెడ్డి అన్నారు. విజయవాడలో..

ప్రపంచంలో అతిపెద్ద పార్టీ బీజేపీ అని... ప్రధాని మోదీ నాయకత్వంలో దేశం అభివృద్ధి చెందుతుందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌ రెడ్డి అన్నారు. విజయవాడలో బీజేపీ రాష్ట్ర కార్యాలయాన్ని ప్రారంభించిన ఆయన... ఏపీలో బీజేపీని బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. ఏపీలో బీజేపీని అధికారంలోకి తీసుకురావాల్సిన బాధ్యత కార్యకర్తలదేనన్నారు. కరోనా కష్టకాలంలో కూడా కేంద్రం పేదలకు అండగా నిలిచిందన్నారు. పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

అనంతరం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బెజవాడ దుర్గమ్మను దర్శించుకున్నారు. ఆయన వెంట.. రాష్ట్ర బీజేపీ నేతలు ఉన్నారు. కరోనా మహమ్మారి నుంచి మానవాళికి విముక్తి కల్గించాలంటూ అమ్మవారిని కోరుకున్నట్లు కిషన్‌ రెడ్డి తెలిపారు. అందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆకాక్షించారు.

Tags

Read MoreRead Less
Next Story