కోడి కత్తి కేసులో కొత్త ట్విస్ట్‌

కోడి కత్తి కేసులో కొత్త ట్విస్ట్‌
కోడి కత్తి కేసులో కొత్త ట్విస్ట్‌ చోటుచేసుకుంది. తనకు జైలు నుంచి విముక్తి కలిగించాలంటూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి నిందితుడు జనిపల్లి శ్రీనివాస్‌ లేఖ రాశాడు

కోడి కత్తి కేసులో కొత్త ట్విస్ట్‌ చోటుచేసుకుంది. తనకు జైలు నుంచి విముక్తి కలిగించాలంటూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి నిందితుడు జనిపల్లి శ్రీనివాస్‌ లేఖ రాశాడు. 16వందల 10 రోజులుగా బెయిల్‌ లేకుండా జైలులోనే ఉంటున్నానని.. తాను ఇంకా ఎంత కాలం జైలులో ఉండాలో తెలియడం లేదని.. విముక్తి కల్పించాలని కోరాడు. తనపై నమోదైన కేసును జిల్లా న్యాయ సేవా ప్రాధికార సంస్థ విచారించి న్యాయం చేయాలని కోరాడు.

తనకు న్యాయం చేయాలని అనేకసార్లు కోర్టుకు విన్నవించానని గుర్తు చేశాడు. అయినా స్పందన లేకపోవడంతో లేఖ రాస్తున్నానని తెలిపాడు. తమది పేద కుటుంబమని లేఖలో ప్రస్తావించాడు. తన తల్లిదండ్రులు వృద్ధులని.. తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నాడు. ఆర్థిక స్తోమత లేకపోవడంతో న్యాయస్థానానికి వెళ్లి న్యాయం పొందలేకపోయానని అన్నాడు. తాను జైల్లో ఉండటంతో తల్లిదండ్రులు మానసికంగా ఎంతో బాధ అనుభవిస్తున్నారని.. తాను కూడా జైల్లో మానసికంగా బాధపడుతున్నానని లేఖలో తెలిపాడు.

Tags

Read MoreRead Less
Next Story