Kodikathi case: నేనొస్తే ట్రాఫిక్ జామ్.. అందుకే కోర్టుకు రావట్లే: సీఎం జగన్

2019 ఎన్నికలకు ముందు సంచలనం సృష్టించిన కోడి కత్తి కేసులో వైసీపీ అధినేత, సీఎం జగన్ పిటిషన్ దాఖలు చేశారు. ప్రస్తుతం ఈ కేసు విచారణ విజయవాడలోని ఎన్‌ఐఏ కోర్టులో జరుగుతోంది. విచారణకు హాజరుకావాలని గత వాయిదాలో మెజిస్ట్రేట్ ఆదేశించిన నేపథ్యంలో.. తాజాగా జగన్ పిటిషన్ వేశారు. అడ్వకేట్ కమిషనర్ ద్వారా సాక్ష్యం నమోదుకు అవకాశం ఇవ్వాలని పిటిషన్‌లో కోరారు. రాష్ట్రానికి సీఎంగా బాధ్యతలు నిర్వర్తించాల్సి ఉందని సంక్షేమ పథకాలపై సమీక్ష సమావేశాలు ఉన్నాయని కోర్టుకు సీఎం హాజరైతే భద్రత కోసం వచ్చే వాహనాలతో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తుతాయని పేర్కొన్నారు. అడ్వకేట్ కమిషనర్‌ను నియమించి ఆయన సమక్షంలో సాక్ష్యం నమోదు చేయించాలంటూ పిటిషన్‌లో జగన్ అభ్యర్థించారు. ఈ కేసు దర్యాప్తును లోతుగా జరపాలంటూ మరో పిటిషన్‌ను కూడా సీఎం దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై ఈనెల 13న విచారణ జరుపుతామని ఎన్‌ఐఏ కోర్టు తెలిపింది. అటు.. కోర్టుకు హాజరైతే బండారం బయటపడుతుందనే జగన్ రావడం లేదని.. సీఎం అయినంత మాత్రాన ఎలాంటి మినహాయింపులు ఉండవన్నారు డిఫెన్స్ లాయర్.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com