ఏపీని సీఎం జగన్‌ సర్వనాశనం చేయాలని కంకణం కట్టుకున్నారు: కొల్లు రవీంద్ర

ఏపీని సీఎం జగన్‌ సర్వనాశనం చేయాలని కంకణం కట్టుకున్నారు: కొల్లు రవీంద్ర
సీఎం జగన్‌ ఏపీని సర్వనాశనం చేయడానికి కంకణం కట్టుకున్నారని.. మాజీ మంత్రి, టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యులు కొల్లు రవీంద్ర విమర్శించారు.

సీఎం జగన్‌ ఏపీని సర్వనాశనం చేయడానికి కంకణం కట్టుకున్నారని.. మాజీ మంత్రి, టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యులు కొల్లు రవీంద్ర విమర్శించారు. కృష్ణ, గోదావరి నదులపై తెలంగాణ ప్రభుత్వం 8 అక్రమ ప్రాజెక్టులు నిర్మిస్తుంటే.. ఏపీ ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. తెలంగాణ ప్రాజెక్టులు పూర్తయితే ఏపీ ఎడారిగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. పాలమూరు-రంగారెడ్డి, డిండి, మిషన్‌ భగీరధ, భక్త రామదాసు, నెట్టెంపాడు, కల్వకుర్తి ప్రాజెక్టులకు.. కేంద్ర జలసంఘం, కృష్ణానది యాజమాన్యం బోర్డు అపెక్స్‌ కౌన్సిల్‌ అనుమతులు లేవన్నారు. ఏపీ ప్రభుత్వానికి ఇవి కనిపించడం లేదా అని ప్రశ్నించారు. మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ముందు చూపుతో పట్టిసీమను పూర్తి చేయడంతోనే.. నేడు రైతాంగానికి సాగు నీరు అందుతుందన్నారు. వైసీపీ ప్రజా ప్రతినిధులు మనకు రావాల్సిన నీటి హక్కుల మీద నోరు విప్పరు కానీ చంద్రబాబుపై మాత్రం విమర్శలు చేస్తారన్నారు. ఏపీ రైతుల ప్రయోజనాలను తెలంగాణకు తాకట్టు పెడితే సహించేది లేదన్నారు.

Tags

Next Story