Konaseema: అక్రమ రొయ్యల చెరువులు

Konaseema: అక్రమ రొయ్యల చెరువులు
పంటపొలాలను కలచివేస్తున్న కాలుష్యం

బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం కందికుప్ప పంచాయతీ పరిధి గాజింగతిప్ప గ్రామం చుట్టూ అనధికార రొయ్యల చెరువులు విస్తరిస్తున్నాయి, దీంతో గ్రామం, పంటపొలాలు కాలుష్య కోరల్లో చిక్కుకున్నాయి. అక్రమ ఆక్వా సాగు పంట పొలాలను సైతం కబలిస్తున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. రెవెన్యూ, మత్స్య శాఖ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడంలేదని వాపోతున్నారు. పైగా అక్రమ చెరువులు తవ్వుతున్న వారినుంచి బెదిరింపులు వస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. పంట పొలాల్లోకి ఆక్వా వ్యర్థాలను వదులుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. తమకు న్యాయం జరగకపోతే చావే శరణ్యమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story