KONASEEMA: కోనసీమలో మావోయిస్టుల కలకలం

ఏపీలో వరుస మావోయిస్టుల ఎన్కౌంటర్ల నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాలు, గోదావరి జిల్లాల్లో ఊరూర జల్లెడ పడుతున్నారు. విజయవాడ, విశాఖ, కాకినాడ, విజయనగరం ప్రాంతాల్లో మావోయిస్టులు అరెస్ట్ కావడంతో.. ఇంకా ఎంతమంది ప్రజల్లో ఉన్నారన్న దానిపై ఫోకస్ పెట్టారు. ఈ నేపథ్యంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెంలో మావోయిస్ట్ అగ్రనేత హిడ్మా అనుచరుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. హిడ్మా అనుచరుడు మాధవిహండా సరోజ్ రావులపాలెంలో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు.. అతన్ని అరెస్ట్ చేసి విచారణ చేస్తున్నారు. ఛత్తీస్ గఢ్ కు చెందిన సరోజ్ రావులపాలెం ఎందుకు వచ్చారు? ఆపరేషన్ కగార్, తెలంగాణలో మావోయిస్టుల లొంగుబాటు నేపథ్యంలో షెల్టర్ కోసమే మావోయిస్టులు ఏపీకి వచ్చారా? లేక మరేదైనా కారణం ఉందా? అన్న కోణంలో ఆరా తీస్తున్నారు.
ఇద్దరు మహిళా మావోలు అరెస్ట్
ప్రాంతంలో పోలీసులు ఇద్దరు మహిళా మావోయిస్టులను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఇద్దరు మహిళలు PLGA టాప్ లీడర్ హిడ్మాకు సెక్యూరిటీగా పనిచేస్తుండగా, హిడ్మా ఎన్కౌంటర్ అనంతరం కాకినాడ వైపు వెళ్తుండగా పోలీసులు వారిని పట్టుకున్నారు. ఇద్దరు మహిళా మావోయిస్టులను అంకిత మరియు అనూషగా గుర్తించారు. ఈ ఇద్దరు మహిళా మావోయిస్టులను విజయవాడకు తరలించారు. ఈ ఇద్దరు మావోయిస్టులు ఏజెన్సీ ప్రాంతం నుంచి శంకవరం, రౌతులపూడి మార్గం ద్వారా కాకినాడ వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా.. పోలీసులకు చిక్కారు. హిడ్మా పై జరిగిన ఆపరేషన్ల తర్వాత మావోయిస్టుల షెల్టర్ జోన్లపై కొనసాగుతున్న దాడులలో భాగంగా ఈ మహిళలను అదుపులోకి తీసుకోవడం జరిగింది. వారిని విచారించి మరిన్ని ముఖ్య సమాచారం పొందేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. వరుస అరెస్టులతో ఏపీలో టెన్షన్ నెలకొంది.
మావోయిస్టులూ లొంగిపోండి: మల్లోజుల వేణుగోపాల్ పిలుపు
ఏపీ ఏజెన్సీ ప్రాంతంలో వరుస ఎన్కౌంటర్ల నేపథ్యంలో మావోయిస్టు దళ మాజీ సభ్యుడు మల్లోజుల వేణుగోపాల్ వీడియో సందేశం విడుదల చేశారు. ఇప్పుడు సమాజం మారిందని, పరిస్థితులను అర్థం చేసుకుని తాము ఆయుధాలను వీడామని వివరించారు. మిగతా దళ సభ్యులు కూడా ఆయుధాలను వీడి జనజీవన స్రవంతిలో కలవాలని పిలుపునిచ్చారు. లొంగిపోయే దళ సభ్యులు తనను సంప్రదించొచ్చని చెప్పారు. తన ఫోన్ నంబర్ 8856038533 తెలియజేశారు. శం కూడా మారుతోంది. ఎన్కౌంటర్లలో మావోయిస్టులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఎన్కౌంటర్లో హిడ్మాతో పాటు పలువురి ప్రాణాలు పోయాయి. మావోయిస్టులు ప్రాణాలు కోల్పోవడం బాధ కలిగించింది అని మల్లోజుల పేర్కొన్నారు. మావోయిస్టులు జన జీవన స్రవంతిలో కలిసి ప్రజా ఉద్యమాలు చేయాలని మల్లోజుల పిలుపునిచ్చారు. దేశ ప్రగతిలో భాగస్వాములవ్వాలని పిలుపునిచ్చారు
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

