ఆ విషయం పీసీపీ చీఫ్ ఉత్తమ్‌కు ముందే చెప్పా : కొండా విశ్వేశ్వరరెడ్డి

ఆ విషయం పీసీపీ చీఫ్ ఉత్తమ్‌కు ముందే చెప్పా : కొండా విశ్వేశ్వరరెడ్డి
ఎవరికీ చెప్పొద్దని కోరడంతో ఉత్తమ్ మాటలను గౌరవించి చెప్పలేదన్నారు.

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగలింది. చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డితత కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. పార్టీ శ్రేణులకు తన రాజీనామా విషయాన్ని ఒక ప్రకటన ద్వారా తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో చేరినప్పటి నుంచి ఇప్పటివరకు మద్దుతుగా నిలిచిన అందరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు. అయితే కొత్త పార్టీ పెట్టాలా..? ఇండిపెండెంట్‌గా ఉండాలా..? లేక మరో పార్టీలో చేరాలా..? అనేది రెండు, మూడు నెలల్లో అందరితో కలిసి చర్చిస్తానని చెప్పారు.

తాను కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ముందే చెప్పానని కొండా విశ్వేశ్వరరెడ్డి స్పష్టంచేశారు. అయితే పార్టీకి నష్టం జరుగుతుందని.. ఎవరికీ చెప్పొద్దని కోరడంతో ఉత్తమ్ మాటలను గౌరవించి చెప్పలేదన్నారు. చేవేళ్ల నియోజకవర్గం అభివృద్ధి కోసం త్వరలో మంచి నిర్ణయంతో ప్రజల ముందుకు వస్తానని కొండా విశ్వేశ్వరరెడ్డి తెలిపారు.Tags

Next Story