పవన్ కల్యాణ్ ప్రచారానికి వరుణ్ తేజ్?.. ఆ మాటలకు అర్థం అదే
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికలకు ముహూర్తం దగ్గరపడింది. ఈ ఎన్నికల్ని జనసేన మరింత ప్రతిష్టాత్మకంగా తీసుకోనుంది. జనసేన తరపున నాగబాబు కూడా ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారు. నాగబాబు ఏ స్థానం నుంచి పోటీ చేస్తారన్న విషయంలో మరికొద్ది రోజుల్లో స్పష్టత వస్తుందని చెబుతున్నారు.
మెగా ఫ్యామిలీలో ఉండే యంగ్ హీరోలు పవన్ తరఫున ప్రచారం చేస్తారా అనే చర్చ జరుగుతోంది. పవన్, నాగబాబు తరపున వరుణ్‌తేజ్ ప్రచారం చేస్తారా? ఆయన క్యాంపెనింగ్‌లో పాల్గొంటారా? అనే ఆసక్తి నెలకొంది. నాగబాబు కొడుకు వరుణ్ తేజ్ కచ్చితంగా ప్రచారానికి వస్తాడని ఫ్యాన్స్ అంటున్నారు.
ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన వరుణ్ తేజ్.. "ఏమో… ఇప్పటి వరకూ ఏం అనుకోలేదు. బాబాయ్ ఏం చెప్పినా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఆయన పిలుపు కోసం ఎదురు చూస్తున్నా" అని చెప్పాడు. వరుణ్‌తో పాటుగా సాయిధరమ్ తేజ్ కూడా ఈసారి ఎన్నికల క్యాంపెయినింగ్ లో కనిపించే ఛాన్సుంది. ప్రస్తుతానికి సినిమాలపైనే ఈ యువహీరోలు దృష్టిపెట్టారు. కొత్త సినిమాల రిలీజ్ కు రెడీ అయ్యారు. ఓ నెల రోజులు షెడ్యూల్ చేసుకుని ప్రచారంలోకి దూకేందుకు రెడీ అయ్యారని సన్నిహితులు చెబుతున్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com