నెల్లూరు జిల్లా ఎస్పీపై ఎమ్మెల్యే ఘాటు వ్యాఖ్యలు

నెల్లూరు జిల్లా ఎస్పీపై ఎమ్మెల్యే ఘాటు వ్యాఖ్యలు
ఇది ఎవరి ప్రభుత్వం అనుకుంటున్నావని వార్నింగ్ ఇచ్చారు ఎమ్మెల్యే.

నెల్లూరు జిల్లా ఎస్పీ భాస్కర్ భూషణ్‌పై కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎస్పీవా లేక తెలుగుదేశం ఏజెంట్ వా అంటూ ప్రశ్నించారు. ఇది ఎవరి ప్రభుత్వం అనుకుంటున్నావని వార్నింగ్ ఇచ్చారు. డీసీఎంఎస్ చైర్మన్ చలపతిరావుపై తప్పుడు పోస్టింగ్ లు పెట్టిన వారిపై ఎస్సీ, ఎస్టీ కేసులు పెట్టమని చెప్పినా ఎందుకు పెట్టలేదని మండిపడ్డారు. మహా అయితే నెల లేదా రెండు నెలలే పోస్టింగ్ లో ఉంటావని.. ఉన్న కొద్దిరోజులైనా జాగ్రత్తగా ఉండాలని ఎస్పీని ఎమ్మెల్యే ప్రసన్నకుమార్‌ రెడ్డి హెచ్చరించారు.Tags

Read MoreRead Less
Next Story