Vishaka Steel Plant: వెనక్కు తగ్గిన కేంద్రం.. కేసీఆర్ దెబ్బంటే అట్లుంటది

విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణపై కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి ఫగ్గన్ సింగ్ కులస్తే గంటల వ్యవధిలో మాట మార్చేశారు. ప్రధాని రోజ్‌గార్ యోజన మేళాలో పాల్గొనడానికి గురువారం విశాఖపట్నం వచ్చిన ఆయన… పోర్టు స్టేడియంలో ఉదయం పదకొండున్నరకు మీడియాతో మాట్లాడాడు. ప్రస్తుతానికి ప్లాంటు విక్రయం ఆలోచన లేదన్నారు. రాబోయే రోజుల్లో కర్మాగారాన్ని బలోపేతం చేస్తామని.. ముడి పదార్థాలు, సొంత గనులు వంటి సమస్యలు ఉన్నాయన్నారు. వాటి పరిష్కారంపై దృష్టి పెడుతున్నామని చెప్పారు. దీంతో ప్రైవేటీకరణపై కేంద్రం వెనుకడుగు వేసిందని అంతా అనుకున్నారు. విశాఖ ఉక్కు విక్రయంపై కేసీఆర్ దెబ్బకు కేంద్రం దిగి వచ్చిందని తెలంగాణ మంత్రి కేటీఆర్ ప్రకటించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ను ఎలా అమ్ముతారో చూస్తాం… సింగరేణి అధికారులను పంపి అధ్యయనం చేయిస్తామని సీఎం కేసీఆర్ చెప్పగానే.. విశాఖ ఉక్కున అమ్మే ప్రతిపాదనను తాత్కాలికంగా విరమించుకున్నట్లు కేంద్రం ఇప్పుడే ప్రకటించింది. కేసీఆర్ దెబ్బ ఎట్లుంటదంటే.. గట్లుంటదని చెప్పారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com