బీజేపీని గద్దె దించితేనే దేశానికి మంచి రోజులు: కూనంనేని

బీజేపీని గద్దె దించితేనే దేశానికి మంచి రోజులు: కూనంనేని
మోదీ ప్రభుత్వాన్ని టార్గెట్‌ చేస్తూ తీవ్ర విమర్శలు చేశారు సీపీఐ నేతలు. దేశాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు.

బీజేపీని గద్దె దించితేనే దేశానికి మంచి రోజులు వస్తాయన్నారు సీపీఐ లీడర్ కూనంనేని. వస్తాయని గళమెత్తారు. బీజేపీ కో హఠావో.. దేశ్‌ కోబచా వో పేరుతో.. కొత్తగూడెం ప్రకాశం మైదానంలో సీపీఐ ప్రజా గర్జన మహా బహిరంగ సభ నిర్వహించారు. మోదీ ప్రభుత్వాన్ని టార్గెట్‌ చేస్తూ తీవ్ర విమర్శలు చేశారు సీపీఐ నేతలు. దేశాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. 9 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందని ప్రశ్నించారు. మతం పేరుతో విచ్ఛిన్నశక్తిగా మారిన బీజేపీని ఎదుర్కొనేందుకు వ్యతిరేక శక్తులన్నీ ఏకం కావాలన్నారు. బీజేపీ ఎందులోనూ కమ్యూనిస్టులకు సాటిరాదని ప్రపంచంలో ఎక్కడా ఎర్ర జెండా లేకుండా హక్కులు సాధించుకున్న చరిత్ర లేదన్నారు. నమ్మిన సిద్ధాంతాలను వదలని తమకు బీజేపీ నేతలు నీతులు చెబుతారా అంటూ మండిపడ్డారు. ప్రధాన సంస్థలన్నింటినీ ప్రైవేట్‌ పరం చేస్తున్నారని సీపీఐ నేతలు కూనంనేని, చాడా నిప్పులు చెరిగారు.


Tags

Read MoreRead Less
Next Story