KUPPAM: కుప్పం అభివృద్ధికి ఆరు ఎంవోయూలు

కుప్పం ప్రాంత అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో 6 ఎంఓయూలు కుదిరాయి. కుప్పం పరిధిలో వ్యర్ధాల నుంచి సంపద కార్యక్రమం అమలు కోసం ఏజీఎస్-ఐటీసీతో ఒప్పందం కుదిరింది. వ్యర్ధాల సుస్థిర నిర్వహణపై ఇంటింటి ప్రచారం, పాఠశాలల్లో అవగాహనా కార్యక్రమాలను 15 ఏళ్ల పాటు నిర్వహించేలా ఒప్పందంజరిగింది. మహిళా పారిశ్రామికవేత్తలను తయారుచేయటం, మహిళా సంఘాలు తయారు చేసిన ఉత్పత్తులకు గ్రామీణ ప్రాంతాల్లో మార్కెటింగ్ అంశాలపై షీలీడ్స్ సంస్థతో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. కుప్పం నియోజకవర్గంలో 10వేల మంది మహిళల్ని ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలుగా తయారు చేయటంతో పాటు గ్రామీణ మార్కెట్లను అందిపుచ్చుకునేలా శిక్షణ ఇచ్చేందుకు ఎంఓయూ చేసుకుంది.
బెంగుళురుకు చెందిన స్పేస్ టెక్నాలజీ సంస్థ ఎత్రెయాల్ ఎక్ప్ ప్లోరేషన్ గిల్డ్ సంస్థతో ప్రభుత్వం అవగాహన ఒప్పందం కుదిరింది. మీడియం లిఫ్ట్ లాంచింగ్ రాకెట్ రేజర్ క్రెస్ట్ ఎంకె-1 తయారీ ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం ఎత్రెయాల్ ఒప్పందం చేసుకుంది. రూ.500 కోట్ల పెట్టుబడిని మూడు దశల్లో పెట్టేలా కార్యాచరణ, మొత్తం 500 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. అగ్రిటెక్, ఫుడ్ ప్రాసెసింగ్ హబ్ ఏర్పాటు చేసేందుకు రెడ్ బెర్రీ ఫుడ్ లాజిస్టిక్స్ తో ఎంఓయూ కుదిరింది. రూ.300 కోట్ల పెట్టుబడితో 15 వేల మందికి ఉపాధి కల్పించేలా ప్రతిపాదన సమర్పించింది. మామిడి, జామ, టమాటో పల్పింగ్ యూనిట్లను ఈ సంస్థ ఏర్పాటు చేయనుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com