Kurnool: పోలీస్ స్టేషన్ లో దొంగలు పడ్డారు

కర్నూలు పోలీస్ స్టేషన్ లో డబ్బు, వెండి మాయం కలకలం రేపుతోంది. 75 లక్షల సొత్తు మిస్సింగ్ మిస్టరీగా మారింది. 2021 జనవరి 28న రాత్రి పంచలింగాల చెక్ పోస్ట్ వద్ద తమిళనాడుకు చెందిన శాతనభారతి, మణికందన్ అనే వ్యాపారుల నుంచి 105 కిలోల వెండి ఆభరణాలు, 2 లక్షల నగదును పట్టుకున్నారు అప్పటి సెబ్ అధికారి లక్ష్మీ దుర్గయ్య. అనంతరం 105 కిలోల వెండి సొత్తును.. నగదును కర్నూలు తాలూకా అర్బన్ పోలీస్ స్టేషన్‌కు అప్పగించారు సెబ్ అధికారులు. సీజ్ చేసిన వెండి సొత్తును, నగదును వాణిజ్య, ఆదాయ శాఖలకు అప్పగించకుండా.. పోలీస్ స్టేషన్ లోని బీరువాలో ఉంచారు పోలీసు అధికారులు.
ఓ మహిళా కానిస్టేబుల్ కు పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించారు. అయితే 2021 జనవరి నుంచి ఇప్పటివరకు ఈ స్టేషన్ లో ముగ్గురు సీఐలు బదిలీలు అయ్యారు. తాజాగా కోర్టు అనుమతి పత్రాలతో వెండి, నగదు కోసం ఆ ఇద్దరు వ్యాపారులు పోలీస్ స్టేషన్‌కు వచ్చారు. బీరువా తెరచి చూస్తే.. వెండి, నగదు కనిపించక పోవడంతో ప్రస్తుత సీఐ రామ లింగయ్య షాక్‌కు గురయ్యారు. సొత్తు ఎలా మిస్ అయ్యిందనే దానిపై నలుగురు సీఐలను విచారిస్తున్నారు పోలీసు ఉన్నతాధికారులు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com