KURNOOL ACCIDENT: బైకర్ మద్యం మత్తు వల్లే పెను ప్రమాదం

KURNOOL ACCIDENT: బైకర్ మద్యం మత్తు వల్లే పెను ప్రమాదం
X
కర్నూలు బస్సు ప్రమాదంలో కొత్త కోణం.. మద్యం మత్తులో తూగిన శివశంకర్.. మత్తులోనే బైక్ నడిపి డివైడర్ కు ఢీ

కర్నూ­లు జి­ల్లా చి­న్న­టే­కూ­రు వద్ద వీ కా­వే­రీ ట్రా­వె­ల్స్ కు చెం­దిన బస్సు ప్ర­మా­దా­ని­కి గు­రి­కా­వ­డా­ని­కి బై­క­ర్ శి­వ­శం­క­ర్ ఆఖరి వీ­డి­యో లభ్య­మైం­ది. ప్ర­మా­దా­ని­కి కొ­ద్ది ని­మి­షాల ముం­దు అతను ఒక పె­ట్రో­ల్ బంక్ కు వె­ళ్లా­డు. ఆ సమ­యం­లో శి­వ­శం­క­ర్ తో మరో యు­వ­కు­డు కూడా ఉన్నా­డు. ఏమైం­దో ఏమో కానీ పె­ట్రో­ల్ పో­యిం­చు­కో­కుం­డా.. శి­వ­శం­క­ర్ ఒక్క­డే అక్క­డి నుం­చి వె­ళ్లి­పో­యా­డు. పె­ట్రో­ల్ బంక్ నుం­చి వె­ళ్లే క్ర­మం­లో బైక్ తో వి­న్యా­సా­లు చే­శా­డు. అప్ప­టి­కే మద్యం సే­విం­చి ఉన్న శి­వ­శం­క­ర్.. పె­ట్రో­ల్ బంక్ నుం­చి వె­ళ్తుం­డ­గా.. అక్క­డే బైక్ స్కి­డ్ అయిం­ది. బైక్ ప్ర­మా­దా­ని­కి గు­రైన ప్రాం­తా­ని­కి 2 కి­లో­మీ­ట­ర్ల దూ­రం­లో­నే ఈ పె­ట్రో­ల్ బంక్ ఉంది. సీ­సీ­టీ­వీ­లో రి­కా­ర్డైన సమయం 24 తేదీ 2.23 గం­ట­లు­గా ఉంది. 3 గంటల తర్వాత శి­వ­శం­క­ర్ బస్సు ప్ర­మా­దా­ని­కి గురై మర­ణిం­చా­డు. తా­గిన మత్తు­లో ఉన్న శి­వ­శం­క­ర్‌.. జా­తీ­య­ర­హ­దా­రి­పై బై­క్‌­తో డి­వై­డ­ర్‌­ను ఢీ­కొ­ట్టి పడి­పో­యి మర­ణిం­చా­డు. నల్ల­రం­గు పల్స­ర్‌ బై­క్‌ అక్క­డే పడి­పో­యిం­ది. దా­న్ని ఒక బస్సు ఢీ­కొ­ట్టిం­ది. తర్వాత వి.కా­వే­రి బస్సు బై­క్‌ మీ­దు­గా వె­ళ్ల­డం­తో.. అది బస్సు కింద ఇరు­క్కు­పో­యిం­ది. 200 మీ­ట­ర్లు అలా­గే ఈడ్చు­కె­ళ్ల­డం­తో రా­పి­డి­కి ని­ప్పు­ర­వ్వ­లు వచ్చి బస్సు మొ­త్తం కా­లి­పో­యిం­ది.

డివైడర్ ను ఢీ కొట్టి మృతి

పె­ట్రో­ల్‌ బం­కు­లో­కి బై­క్‌ వచ్చే­ట­ప్పు­డు దా­ని­పై శి­వ­శం­క­ర్‌­తో పాటు మరో యు­వ­కు­డు కూడా ఉన్న­ట్లు సీ­సీ­టీ­వీ ఫు­టే­జీ­ల్లో కన­ప­డిం­ది. దీం­తో ఆ యు­వ­కు­డి గు­రిం­చి పో­లీ­సు­లు వి­చా­రణ చే­య­గా అతను తు­గ్గ­లి మం­డ­లం రాం­ప­ల్లి­కి చెం­దిన ఎర్రి­స్వా­మి ఎలి­యా­స్‌ నాని అని తే­లిం­ది. పో­లీ­సు­లు శని­వా­రం అత­న్ని వి­చా­రిం­చ­గా.. పలు కీలక వి­ష­యా­లు వె­ల్ల­డిం­చా­డు.పె­ట్రో­లు పో­యిం­చు­కు­న్నాక శి­వ­శం­క­ర్‌ మద్యం మత్తు­లో­నే ఎర్రి­స్వా­మి­ని ఎక్కిం­చు­కు­ని బయ­ల్దే­రా­డు. పల్స­ర్‌ వా­హ­నం హె­డ్‌­లై­ట్‌ పని­చే­య­క­పో­వ­డం­తో బ్లిం­క­ర్‌ వే­సు­కు­ని ముం­దు­కె­ళ్లా­డు. ఇష్టా­రా­జ్యం­గా వా­హ­నం నడి­పి జా­తీ­య­ర­హ­దా­రి­పై డి­వై­డ­ర్‌­ను వే­గం­గా ఢీ­కొ­ట్టా­డ­ని ఎర్రి­స్వా­మి పో­లీ­సు­ల­కు తె­లి­పా­డు. శి­వ­శం­క­ర్‌ తీ­వ్ర­గా­యా­ల­తో రో­డ్డు­పై పడి­పో­గా తాను పక్క­కు లాగి చూ­స్తే అతను చని­పో­యి­న­ట్లు ని­ర్ధా­రణ అయ్యిం­ద­ని వి­వ­రిం­చా­డు. ఆ ప్ర­మా­దం­లో తానూ పడ­టం­తో స్వ­ల్ప గా­యా­ల­య్యా­య­ని చె­ప్పా­డు. రో­డ్డు­కు అడ్డం­గా పడు­న్న వా­హ­నా­న్ని పక్క­కు లా­గు­దా­మ­ని అను­కు­నే­లో­పే ఓ బస్సు దా­న్ని ఢీ­కొ­ట్టిం­ద­ని, తర్వాత వే­మూ­రి కా­వే­రి ట్రా­వె­ల్స్‌ బస్సు వే­గం­గా వచ్చి ద్వి­చ­క్ర వా­హ­నా­న్ని ఢీ­కొ­ట్టి దా­న్ని ఈడ్చు­కుం­టూ వె­ళ్లిం­ద­ని, దాం­తో మం­ట­లు చె­ల­రే­గా­య­ని వి­వ­రిం­చా­డు.

Tags

Next Story