విశాఖలో రూ.10 కోట్ల విలువైన ప్రైవేటు స్థలం కబ్జాకు యత్నం
X
By - Nagesh Swarna |7 Sept 2020 8:59 AM IST
విశాఖ మధురవాడలో 10 కోట్ల విలువైన ప్రైవేటు స్థలాన్ని నకిలీ డాక్యుమెంట్లతో కబ్జా చేసేందుకు విఫలయత్నం చేశారు కొందరు అక్రమార్కులు. అసలు యజమానులు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దర్యాప్తు చేపట్టిన పోలీసులు రియల్ ఎస్టేట్ వ్యాపారి జామి సత్యరవికిశోర్‌తో సహా ఐదుగురిని అరెస్ట్ చేశారు. మధురవాడలోని దుర్గానగర్‌లో ఉన్న సర్వే నెంబర్ 249/10లో కబ్జాకు యత్నించినట్లు ఏసీపీ రవిశంకర్‌రెడ్డి తెలిపారు. వీరు ప్రహరీగోడను తొలగించి బెదిరింపులకు దిగారని వెల్లడించారు. 24 గంటల్లోనే దర్యాప్తు పూర్తి చేసి నిందితుల్ని రిమాండ్‌కు తరలించినట్లు చెప్పారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com