Vishakapatnam Real Estate: భూములకు రెక్కలు

Vishakapatnam Real Estate: భూములకు రెక్కలు
లులు సంస్థకు కేటాయించేందుకు గుర్తించిన విలువైన భూమి భూమి విలువ మార్కెట్‌ విలువ రూ.వెయ్యి కోట్లపైనే

విశాఖలో విలువైన భూములకు రెక్కలు వచ్చాయి.గత టీడీపీ హయాంలో లులు సంస్థకు కేటాయించేందుకు గుర్తించిన విలువైన భూములను విక్రయిస్తారన్న ప్రచారం జరుగుతోంది.ఆ భూములను ఏపీఐఐసీ నుంచి గ్రేటర్‌ విశాఖ అభివృద్ధి సంస్థ బదిలీ చేయడంతో ఈ ప్రచారానికి బలం చేకూర్చుతోంది. బహిరంగ మార్కెట్‌లో ఈ భూముల విలువ వెయ్యి కోట్లపైనే ఉంటుదని విశాఖ వాసులు అంటున్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే లులు ప్రాజెక్టును రద్దు చేసుకుంది. దీంతో లులు తమిళనాడుకు తరలిపోయింది.ఈ మాల్‌ విశాఖలో ఏర్పాటుచేసి ఉంటే ఐదు వేల మందికి ఉపాధి లభించేది.

గత ప్రభుత్వ హయాంలో లులుకు బీచ్‌ రోడ్డులో ఏపీఐఐసీకి చెందిన 10.43 ఎకరాలను కేటాయించాలని గత ప్రభుత్వం బావించింది. దీనికోసం బీచ్‌ రోడ్డు ఫేసింగ్‌ లో ఓ ప్రైవేటు స్థలాన్ని తీసుకోవటానికి నిర్ణయించారు. 3.40 ఎకరాలు అప్పగించేలా స్థల యాజమాన్యాన్ని ప్రభుత్వం ఒప్పించింది. దీనికి ప్రత్యామ్నాయంగా వారికి అప్పటి ప్రభుత్వ మార్కెట్‌ విలువ ప్రకారం వీఎంఆర్‌డీఏకు ఆరు చోట్ల ఉన్న 4.85 ఎకరాలను అప్పగించింది.

ఇక వైసీపీ అధికారంలోకి వచ్చాక లులుతో ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. ప్రైవేటు సంస్థ నుంచి తీసుకున్న భూములు ఏపీఐఐసీ చేతుల్లోకి వెళ్లాయి. ఈ భూములు వీఎంఆర్‌డీఏకు అప్పగించాలని ఇటీవల ఏపీఐఐసీ ఎండీ ఆదేశించారు. రెండు వారాల కిందటే ఆ ప్రక్రియ పూర్తయింది. వీటిని విక్రయించేందుకే వీఎంఆర్‌డీఏకు బదలాయించారని విశాఖ వాసులు అంటున్నారు.

మరోవైపు స్టార్‌హోటళ్లు,షాపింగ్‌ కాంప్లెక్సులకు అనువైన స్థలం కాబట్టే అధికారకి చెందిన కీలక నేత కన్నుపడిందని అంటున్నారు. ఇటీవలి పరిణామాలు కూడా కీలక నేతకు అనుకూలంగా ఉన్నాయని రాజకీయ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. ఈ భూములు ప్రభుత్వ విలువ ప్రకారమే చదరపుగజం 90 వేలు. బహిరంగ మార్కెట్‌లో 2 లక్షల వరకు ఉంది. దీంతో ఇక్కడి భూముల మార్కెట్‌ విలువ వెయ్యి కోట్లపైనే ఉంటుంది. మధురవాడ, పరవాడ, కాపులుప్పాడ వంటి ప్రాంతాల్లోని భూములను ప్రస్తుతం వీఎంఆర్‌డీఏ అమ్మకానికి పెట్టింది. కొంతకాలంగా వాటికి వేలం వేస్తున్నా ఎవరూ కొనడం లేదు. మళ్లీ వేలం వేయాలనుకుంటున్నారు. ‘గత నెలలోనే బీచ్‌ రోడ్డులోని ఏపీఐఐసీ భూములను వీఎంఆర్‌డీఏ స్వాధీనం చేసుకుంది.

Tags

Read MoreRead Less
Next Story