ల్యాండింగ్‌కు సిగ్నల్ ఇవ్వని అధికారులు.. గాల్లోనే చక్కర్లు కొట్టిన రెండు విమానాలు
విమానం గాల్లోనే చక్కర్లు కొట్టడంతో.. ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేశారు.

గన్నవరం ఎయిర్ పోర్ట్ వద్ద దట్టమైన పొగమంచు కారణంగా రెండు విమానాలు గాల్లోనే చాలా సేపు చక్కర్లు కొట్టడం కలకలం రేపింది. బెంగళూరు నుంచి గన్నవరం వచ్చిన స్పైస్ జెట్ విమానం దట్టమైన పొగమంచు కారణంగా ల్యాండ్ అయ్యేందుకు సిగ్నల్ రాలేదు. విమానం గాల్లోనే చక్కర్లు కొట్టడంతో.. ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేశారు. దట్టమైన పొగమంచు కారణంగా.. విమానం ల్యాండ్ అయ్యేందుకు గన్నవరం ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అధికారులు సిగ్నల్ ఇవ్వలేదు. ఆ తర్వాత సిగ్నల్ దొరకడంతో.. 40 నిమిషాలు ఆలస్యంగా ల్యాండ్ అయ్యింది. మరోవైపు ఢిల్లీ నుంచి గన్నవరం వచ్చిన ఎయిర్ ఇండియా విమానం కుడా పొగమంచు కారణంగా గాల్లోనే చక్కర్లు కొట్టి.. చివరకు 15 నిమిషాలు ఆలస్యంగా ల్యాండ్ అయ్యింది.
Next Story