సంచలనం సృష్టించిన వివేకా హత్య కేసులో తాజా ఎఫ్ఐఆర్..

సంచలనం సృష్టించిన వివేకా హత్య కేసులో తాజా ఎఫ్ఐఆర్..

సంచలనం సృష్టించిన వివేకా హత్య కేసులో తాజా FIR ఒకటి వెలుగులోకి వచ్చింది. ఈ ఏడాది జులై 9న సీబీఐ ఈ కేసు నమోదు చేసింది. దర్యాప్తు బాధ్యతలు ఢిల్లీలోని స్పెషల్ బ్రాంచ్‌కి అప్పగించారు. IPC సెక్షన్ 302 ప్రకారం హత్యానేరం అభియోగంతో కేసు రీరిజిస్టర్‌ చేశారు. ముందుగా వివేకా మృతిపై CRPC సెక్షన్ 174 కింద.. అంటే మృతికి కారణం తెలియని కేసుగా నమోదు చేశారు. దీన్ని 302గా ఇప్పుడు మార్చారు. ప్రత్యేక నేరాల దర్యాప్తు విభాగానికి చెందిన థర్డ్‌ బ్రాంచ్‌ డీఎస్పీ దీపక్ గౌర్‌కి ఈ కేసు తేల్చే బాధ్యత అప్పగించారు. త్వరలోనే ఈ స్పెషల్ టీమ్‌ రంగంలోకి దిగి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయబోతోంది.

Tags

Read MoreRead Less
Next Story