కోడికత్తి కేసులో న్యాయవాది అబ్దుల్ సలీం సంచలన వ్యాఖ్యలు

కోడికత్తి కేసులో నిందితుడు శ్రీనివాస్ తరఫు న్యాయవాది అబ్దుల్ సలీం సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్‌కు గాయమైతే ఆయన చొక్కా ఎందుకు చిరగలేదని, కేవలం అర సెంటీమీటరు లోతైన గాయమైతే ఇది హత్యాయత్నం కేసు ఎలా అవుతుందని ప్రశ్నించారు. నిందితుడు శ్రీనివాస్ రెండు చేతుల్లోనూ రెండు నీళ్ల బాటిళ్లతో వచ్చారని, ఎలా దాడి చేయగలరన్నారు. ఈ ఘటన దర్యాప్తులో ఎవరూ దాడిని ప్రత్యక్షంగా చూడలేదని ఎన్‌ఐఏ సేకరించిన సాక్ష్యాలతోనే వెల్లడైందన్నారు. రక్తంతో ఉన్న తెల్లచొక్కా ఫొటో తప్ప ఇంకే ఆధారాలూ బయటకు రాలేదన్నారు. గాయం ఎంత, ఏమిటనేది ఎవరికీ తెలియకపోవటం సందేహంగా ఉందన్నారు.అసలు సీసీ కెమెరాలు లేనిచోట ఇలాంటి ఘటన జరగటం పలు అనుమానాలకు తావిస్తోందన్నారు. నాలుగేళ్లుగా జైల్లో ఉన్న నిందితుడి కుటుంబం నానా కష్టాలు పడుతున్నందున వారిని ఆదుకోవాలన్నారు సలీం.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com