Leopard: కడియంలో చిరుత సంచారం

X
By - Sathwik |25 Sept 2024 11:45 AM IST
కార్మికులకు బుధవారం సెలవు ప్రకటించిన నర్సరీ సంఘం
తూర్పు గోదావరి జిల్లాలో చిరుత సంచారం తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. దివాన్ చెరువు అటవీ ప్రాంతం నుండి చిరుత కడియం వైపు జనావాసాల్లోకి పయనిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. మంగళవారం రాత్రి కడియపు లంక దోసాలమ్మ కాలనీలో ఇది సంచరించింది. చిరుతను చూసిన నర్సరీ రైతు మధు అధికారులకు సమాచారం ఇచ్చారు. డీఎఫ్ఓ భరణి అక్కడకు చేరుకుని పాదముద్రలు సేకరించి చిరుతగా నిర్ధారించారు. దీంతో నర్సరీ కార్మికులకు నర్సరీ సంఘం బుధవారం సెలవు ప్రకటించింది. ఆలమూరు మండలం గోదావరి తీరం వైపునకు చిరుత పయనిస్తున్నట్లు అటవీ అధికారులు అనుమానిస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. చిరుత సంచారంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com