లారీ డ్రైవర్‌పై దాడి చేసిన చిరుత.. అక్కడే ఓ ఆవును చూసి..

హైదరాబాద్ శివార్లలోని రాజేంద్రనగర్ పరిసర ప్రాంతాల్లో మరోసారి చిరుత పులి కలకలం రేపుతోంది. గగన్‌పహాడ్‌లోని ఓల్డ్ కర్నూల్ రోడ్డులో.. నడి రోడ్డుపై చిరుత నిద్రిస్తూ కనిపించడంతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు.
చిరుతను బంధించేందుకు.. అటవీశాఖ అధికారులు తీవ్రంగా ప్రయత్నించారు. ఆ తర్వాత లారీ డ్రైవర్‌పై దాడి చేసి.. పక్కనే ఉన్న జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలోని చిరుత తప్పించుకుంది. అక్కడే ఓ ఆవుపై దాడి చేసినట్టు.. స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
రాజేంద్రనగర్‌తోపాటు.. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్, చుట్టుగొల్లపల్లి, మామిడిపల్లి ప్రాంతాల్లో చిరుతలు సంచరించడంతో స్థానికులు గజగజ వణికిపోతున్నారు. అటవీ శాఖ అధికారుల త్వరగా స్పందించాలని స్థానికులు కోరుతున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com