Talari Venkat Rao : వైసీపీ ఎమ్మెల్యే తలారి వెంకట్రావు పై దాడి

Talari Venkat Rao : ఏలూరు జిల్లా ద్వారకాతిరుమల మండలం జి.కొత్తపల్లిలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. గోపాలపురం వైసీపీ ఎమ్మెల్యే తలారి వెంకట్రావుపై దాడి జరిగింది. ఉదయం 7 గంటలకు వైసీపీ కార్యకర్త గంజి ప్రసాద్ దారుణహత్యకు గురయ్యాడు. అయితే.. ప్రసాద్ కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు ఎమ్మెల్యే వెళ్లారు. గంజి ప్రసాద్ హత్యకు ఎమ్మెల్యేనే కారణమంటూ చుట్టుముట్టి చితకబాదారు మృతుని బంధువులు, వైసీపీ కార్యకర్తలు.
ఈ దాడిలో ఎమ్మెల్యేకు స్వల్ప గాయాలయ్యాయి. అడ్డుకోబోయిన పోలీసులపైనా రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కానిస్టేబుల్‌కు తీవ్ర గాయాలయ్యాయి. గ్రామంలో పరిస్థితి అదుపుతప్పడంతో పోలీసులు భారీగా మోహరించారు. అటు.. ఎమ్మెల్యే తలారి వెంకట్రావు ప్రాణభయంతో స్థానిక స్కూల్‌లో తలదాచుకున్నారు. ఎమ్మెల్యేను జి.కొత్తపల్లి నుంచి తరలించడానికి స్పెషల్ ఫోర్స్‌ను తెప్పిస్తున్నారు.
వైసీపీ కార్యకర్త గంజి ప్రసాద్ ను కత్తులతో నరికి చంపారు దుండగులు. అయితే.. వైసీపీలో వర్గ విభేదాలే హత్యకు కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com