LOKESH: ‘మీకు హ్యాట్సాఫ్ సార్’.. టీచర్‌పై లోకేష్ ప్రశంసలు

గురువులు తలుచుకుంటే విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపడమే కాకుండా, సమాజాన్ని సైతం కదిలించవచ్చని నిరూపించిన ఘటన ఒకటి ఏపీలో చోటుచేసుకుంది. రాష్ట్రంలోని ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేట మండలం నరసాపురం జడ్పీహెచ్ఎస్కు చెందిన ఇంగ్లీష్ టీచర్ శ్రీధర్ బొల్లేపల్లి ఓ నిరుపేద విద్యార్థికీ బ్రెయిన్ సర్జరీ చేయించారు. ఫేస్బుక్లో ఉపాద్యాయుడు శ్రీధర్ పెట్టిన పోస్ట్ చూసి దాతలు రూ.6 లక్షలు అందించారు. ఈ విషయం ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ దృష్టికి వెళ్లడంతో ఆయన ట్విట్టర్ వేదికగా ప్రశంసల వర్షం కురిపించారు. అంకితభావంతో బోధన, నిస్వార్థ సేవాకార్యక్రమాల ద్వారా విద్యార్థులకు మార్గదర్శిగా నిలుస్తోన్న ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేట మండలం నరసాపురం జడ్పీ హైస్కూల్ ఇంగ్లీష్ టీచర్ శ్రీధర్ బొల్లేపల్లికి మంత్రి నారా లోకేష్ అభినందనలు తెలిపారు. ప్రమాదానికి గురైన ఓ విద్యార్థి బ్రెయిన్ సర్జరీ కోసం రూ.6 లక్షలు విరాళాలు పోగుచేసి ప్రాణాలు నిలిపిన ఆయనకు హ్యాట్సాఫ్ అని మంత్రి లోకేష్ పేర్కొన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com