నెల్లూరు జిల్లా యువతతో లోకేష్‌ ముఖాముఖి

నెల్లూరు జిల్లా యువతతో లోకేష్‌ ముఖాముఖి
X
జగన్‌ దెబ్బకు పెట్టుబడులు పెట్టే వాళ్లు పారిపోతున్నారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ అన్నారు.

జగన్‌ దెబ్బకు పెట్టుబడులు పెట్టే వాళ్లు పారిపోతున్నారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ అన్నారు. యువగళం పాదయాత్రలో భాగంగా నెల్లూరు జిల్లా ఆత్మకూరు యువతతో ఆయన ముఖాముఖి నిర్వహించారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే పోలీస్ నియామకాలను పూర్తిస్థాయిలో చేపడతామని రాజకీయాలకు సంబంధం లేకుండా ఏపీపీఎస్సీ బలోపేతం చేస్తామన్నారు. ఇసుక, మద్యం, గ్రావెల్ దందాలకు కేరాఫ్ తాడేపల్లి ప్యాలెస్‌ అని ఆరోపించారు. పులివెందులలో దళిత కుటుంబాలను కొట్టి చంపడం, కుటుంబాలను మాయం చేసిన చరిత్ర వైసీపీదేనని ఆరోపించారు. 9 సార్లు కరెంట్‌ ఛార్జీలు పెంచిన ఘనత జగన్‌దేనని ఎద్దేవా చేశారు.

Tags

Next Story