AP:లోకేశ్ తో ఇప్పాల రవీంద్రారెడ్డి భేటీ

AP:లోకేశ్ తో ఇప్పాల రవీంద్రారెడ్డి భేటీ
X
భగ్గుమన్న టీడీపీ శ్రేణులు... తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన లోకేశ్

సోషల్ మీడియాలో చంద్రబాబు, లోకేష్ సహా ఇతర టీడీపీ నేతలపై అనుచిత పోస్టులు పెట్టిన ఇప్పాల రవీంద్రారెడ్డి.. మంత్రి లోకేష్‌ను కలవడం తీవ్ర రచ్చకు దారి తీసింది. సిస్కోతో ఏపీ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందంలో ఇప్పాల పాల్గొన్నారు. ఎంవోయూ మొత్తాన్ని కూడా రవీంద్రారెడ్డి కోఆర్డినేట్ చేశారు. దీనిపై టీడీపీ నేతలు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గతంలో రవీంద్రారెడ్డి పెట్టిన పోస్టులను మళ్లీ వైరల్ చేస్తున్నారు.

లోకేశ్ ఆగ్రహం.. సిస్కోకు లేఖ

సోషల్ మీడియాలో చంద్రబాబు, తనపై అనుచిత పోస్టులు పెట్టిన ఇప్పాల రవీంద్రారెడ్డి... తనను కలవడంపై మంత్రి నారా లోకేశ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పేషీ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేసిన లోకేశ్... వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దీంతో లోకేష్ పేషీ సిబ్బంది.. సిస్కోకు ఘాటుగా లేఖ రాసింది. భవిష్యత్తులో ప్రభుత్వంతో సిస్కో చేపట్టే ప్రాజెక్టుల్లో ఇప్పాల రవీంద్రారెడ్డిని పక్కన పెట్టాలని కోరింది. ఇప్పాల రవీంద్రారెడ్డి సోషల్ మీడియా రికార్డుతో పాటు అతనిపై నమోదైన కేసుల వివరాలును కూడా పంపింది. ఇంకెప్పుడు ఏపీ ప్రభుత్వానికి సంబంధించిన వ్యవహారాలను చర్చించేందుకు ఆ వ్యక్తిని తీసుకు రావొద్దని స్పష్టం చేశారు. లోకేష్ తో ఇప్పాల రవీంద్రారెడ్డి భేటీ అయ్యారని అలా ఎలా అంగీకరించారని సోషల్ మీడియాలో ప్రశ్నలు వెల్లువెత్తాయి. దాంతో లోకేష్ టీం వెంటనే క్రాస్ చెక్ చేసుకుంది. సిస్కో బృందంలో వచ్చిన వ్యక్తుల పేర్లను చూసింది. ఐ.రవీంద్రారెడ్డి అనే వ్యక్తి ఉన్నారు. దీంతో అతనే ఇప్పాల రవీందారెడ్డి అనే క్లారిటీకి వచ్చారు.

ప్రమాదంలో ఉద్యోగం

ఇప్పాల రవీంద్రారెడ్డి ఇప్పుడు టీడీపీకి వ్యతిరేకంగా పోస్టులు పెట్టడం లేదు కానీ...గతంలో ఆయన పెట్టిన పోస్టులపై మాత్రం తెలుగు దేశం నేతలు భగ్గుమంటున్నారు. రవీంద్రారెడ్డి ఉద్యోగం కొనసాగింపుపై సిస్కో ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇలాంటి ఘోరమైన సోషల్ మీడియా రికార్డు ఉన్న వారిని కార్పొరేట్ సంస్థలు అంగీకరించబోవని హెచ్ఆర్ నిపుణులు చెబుతున్నారు. తనపై నమోదైన కేసుల గురించి దాచి పెట్టి ఆయన ఉద్యోగంలో చేరి ఉంటారని భావిస్తున్నారు.

Tags

Next Story