LOKESH: టాటా గ్రూప్ ఛైర్మన్‌తో నారా లోకేశ్ భేటీ

LOKESH: టాటా గ్రూప్ ఛైర్మన్‌తో నారా లోకేశ్ భేటీ
X
టాటా ఛైర్మన్ చంద్రశేఖరన్‌తో లోకేశ్ భేటీ.. ఏపీలో పెట్టుబడులు పెట్టాలంటూ వినతి.. అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలన్న లోకేశ్

ఆం­ధ్ర­ప్ర­దే­శ్‌­లో జరు­గు­తు­న్న అభి­వృ­ద్ధి­లో భా­గ­స్వా­ము­లు కా­వా­ల­ని టాటా గ్రూ­ప్ ప్ర­తి­ని­ధు­ల­ను ఏపీ వి­ద్య, ఐటీ, ఎల­క్ట్రా­ని­క్స్ శాఖల మం­త్రి నారా లో­కే­శ్‌ ఆహ్వా­నిం­చా­రు. ఆం­ధ్ర­‌­ప్ర­‌­దే­శ్‌­లో పె­ట్టు­బ­‌­డు­లు పె­ట్టా­ల­‌­ని ప‌­లు­వు­రు పా­రి­శ్రా­మి­క­‌­వే­త్త­‌­ల్ని మం­త్రి నారా లో­కే­శ్ వి­జ్ఞ­‌­ప్తి చే­శా­రు. ముం­బ­‌­య్ ప‌­ర్య­‌­ట­‌­న­‌­లో భా­గం­గా పా­రి­శ్రా­మిక ది­గ్గ­‌­జా­ల­‌­తో ఆయ‌న భేటీ అయ్యా­రు. ఇం­దు­లో భా­గం­గా టాటా గ్రూ­పు చై­ర్మ­‌­న్ చం­ద్ర­‌­శే­ఖ­‌­ర­‌­న్‌, ట్రా­ఫి­గు­రా ఇం­డి­యా సీ­ఈ­వో సచి­న్ గు­ప్తా, ఈఎ­స్ఆ­ర్ గ్రూ­ప్ ఇం­డి­యా ఇన్వె­స్టి­మెం­ట్స్ హెడ్ సా­ద­త్ షా, ఆ సం­స్థ­‌­ల­‌­కు సం­బం­ధిం­చి వి­విధ హో­దా­ల్లో­ని ప్ర­‌­ము­ఖు­ల­‌­తో లో­కే­శ్ కీ­ల­‌క చ‌­ర్చ­‌­లు జ‌­రి­పా­రు. వి­శా­ఖలో ఈ నె­ల­లో ని­ర్వ­హిం­చ­ను­న్న టీ­సీ­ఎ­స్ డె­వ­ల­ప్ మెం­ట్ సెం­ట­ర్ ప్రా­రం­భో­త్సవ కా­ర్య­క్ర­మా­ని­కి హా­జ­రు­కా­వా­ల్సిం­ది­గా ఆహ్వా­నిం­చా­రు. టాటా పవర్ రె­న్యూ­వ­బు­ల్స్ ఆధ్వ­ర్యాన రా­ష్ట్ర­వ్యా­ప్తం­గా ఎల­క్ట్రి­క్ వా­హ­నాల ఛా­ర్జిం­గ్ ఇన్‌­ఫ్రా­స్ట్ర­క్చ­ర్ అభి­వృ­ద్ధి కోసం ప్ర­భు­త్వం­తో భా­గ­స్వా­మ్యం వహిం­చా­ల­ని కో­రా­రు. ఏపీ ప్ర­జ­ల­కు సౌ­ల­భ్యం­గా ఉం­డే­లా రూ­ఫ్‌­టా­ప్ సో­లా­ర్ అభి­వృ­ద్ధి చేసే ప్ర­క్రి­య­లో ప్ర­భు­త్వం­తో కలి­సి పని­చే­సే మా­ర్గా­న్ని అన్వే­షిం­చా­ల­ని, సెల్, మా­డ్యూ­ల్ మా­న్యు­ఫా­క్చ­రిం­గ్ యూ­ని­ట్ స్థా­ప­న­కు గల అవ­కా­శా­ల­ను పరి­శీ­లిం­చా­ల­ని వి­జ్ఞ­ప్తి చే­శా­రు.

ఇంజనీరింగ్ సెంటర్ ఏర్పాటుకు వినతి

శ్రీ­సి­టీ­లో ఇం­జి­నీ­రిం­గ్‌ సెం­ట­ర్‌ ఏర్పా­టు చే­యా­ల­ని కూడా మం­త్రి లో­కే­శ్‌ వి­జ్ఞ­ప్తి చే­శా­రు. ఏరో­స్పే­స్‌, డి­ఫె­న్స్‌ రం­గా­ల్లో ఉత్ప­త్తి యూ­ని­ట్లు ప్రా­రం­భిం­చా­ల­ని కో­రిన ఆయన.. టాటా ఎల­క్ట్రా­ని­క్స్‌ ఆధ్వ­ర్యం­లో ఓఎ­స్‌­ఏ­టీ ఏర్పా­టు చే­యా­ల­ని కూడా కో­రా­రు. గ్లో­బ­ల్ రి­య­ల్ ఎస్టే­ట్ ఇన్వె­స్టి­మెం­ట్ ప్లా­ట్‌­ఫాం ఈఎ­స్ఆ­ర్ గ్రూ­ప్ ఇం­డి­యా ఇన్వె­స్టి­మెం­ట్స్ అధి­ప­తి సా­ద­త్ షా, డై­రె­క్ట­ర్ (లీ­జిం­గ్) ప్ర­కృ­త్ మె­హ­తా­తో­నూ మం­త్రి లో­కే­శ్‌ భేటీ అయ్యా­రు. ముం­బ­యి­లో­ని తాజ్ ల్యాం­డ్స్ హో­ట­ల్‌­లో జరి­గిన ఈ భే­టీ­లో ఏపీ సము­ద్ర ఎగు­మ­తుల కోసం కం­టై­న­ర్ ఫ్రై­ట్ స్టే­ష­న్లు, గి­డ్డం­గుల ని­ర్మా­ణం, పో­ర్టు ఆధా­రిత లా­జి­స్టి­క్స్‌­లో పె­ట్టు­బ­డు­లు పె­ట్టా­ల్సిం­ది­గా వా­రి­కి లో­కే­శ్ వి­జ్ఞ­ప్తి చే­శా­రు. గ్లో­బ­ల్ రి­య­ల్ ఎస్టే­ట్ ఇన్వె­స్టి­మెం­ట్ ప్లా­ట్ ఫాం ఈఎ­స్ఆ­ర్ గ్రూ­ప్ ఇం­డి­యా ఇన్వె­స్టి­మెం­ట్స్ హెడ్ సా­ద­త్ షా, డై­రె­క్ట­ర్ (లీ­జిం­గ్) ప్ర­కృ­త్ మె­హ­తా­తో లో­కే­శ్ భేటీ అయ్యా­రు. లో­కే­శ్‌ మా­ట్లా­డు­తూ… వి­జ­న­రీ సీఎం చం­ద్ర­బా­బు­నా­యు­డు నే­తృ­త్వం­లో ఇటీ­వల ఏపీ ప్ర­భు­త్వం ఆమో­దిం­చిన ప్ల­గ్&ప్లే ఇం­డ­స్ట్రి­య­ల్ పా­ర్క్స్ పా­ల­సీ 4.0 పె­ట్టు­బ­డు­ల­కు అను­కూ­లం­గా ఉం­ద­‌­న్నా­రు. వి­శా­ఖ­ప­ట్నం, కా­కి­నాడ, తి­రు­ప­తి మా­ర్గా­ల్లో 1,000 ఎక­రా­ల­కు పైగా మెగా ఇం­డ­స్ట్రి­య­ల్ పా­ర్కు­ల­ను అభి­వృ­ద్ధి చే­స్తు­న్నా­మ­‌­న్నా­రు.

Tags

Next Story