LOKESH: మాటల్లో కాదు..చేతల్లో చూపిస్తున్నాం

స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ను మాటల్లో కాకుండా చేతల్లో చూపుతున్నామని.. 15నెలల్లో ఆంధ్రప్రదేశ్‌కి 10లక్షల కోట్ల పెట్టుబడులు ఆకర్షించామని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ తెలిపారు. అది విజనరీ లీడర్ చంద్రబాబు సమర్థ నాయకత్వం వల్లే ఇది సాధ్యమైందన్నారు. విశాఖపట్నంలో నవంబర్ 14, 15 తేదీల్లో ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న పార్టనర్ షిప్ సమ్మిట్ -2025 కు గ్లోబల్ పారిశ్రామికవేత్తలకు ఆహ్వానం పలికేందుకు లండన్ లోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ డైరక్టర్స్, పాల్ మాల్ కన్వెన్షన్ వేదికగా ఏపీ ప్రభుత్వం - యుకె బిజినెస్ ఫోరం నిర్వహించిన రోడ్ షోలో నారా లోకేష్ పాల్గొన్నారు. క్వాంటమ్ వ్యాలీ, డేటా సిటీలతో ఏపీ రూపురేఖలు మారిపోతాయన్నారు. పరిశ్రమల స్థాపనకు ప్రతిబంధకంగా ఉన్న నిబంధనలను సవరిస్తున్నట్లు వివరించారు. ఏఐ అవకాశాలను అందిపుచ్చుకునేందుకు ప్రత్యేక పాఠ్యాంశాలు రూపొందిస్తున్నట్లు మంత్రి నారా లోకేశ్ చెప్పారు.పరిశ్రమల స్థాపనకు ప్రతిబంధకంగా ఉన్న నిబంధనలు సవరిస్తున్నామని అన్నారు. విశాఖపట్నం అన్ని విధాలా అనుకూలంగా ఉంటుందని, తమ రాష్ట్రానికి రమ్మని ఆహ్వానించారు. మంత్రి లోకేష్ ఆహ్వానంపై ఆ సీఈవో ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.
లండన్‌లో ప్రత్యేక పూజలు
ప్రధాని మోదీ 75వ జన్మదినాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ లండన్‌లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. లండన్‌లోని ప్రఖ్యాత ఇస్కాన్ ఆలయాన్ని సందర్శించి, ప్రధాని మోదీ ఆయురారోగ్యాలతో, దీర్ఘాయుష్షుతో ఉండాలని ఆకాంక్షిస్తూ పూజలు చేశారు. ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ, దేశానికి ప్రధాని మోదీ దార్శనిక నాయకత్వం మరిన్ని ఏళ్లపాటు అందాలని ఆ భగవంతుడిని ప్రార్థించినట్లు తెలిపారు. "మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోదీ గారి 75వ జన్మదినం సందర్భంగా లండన్ ఇస్కాన్ ఆలయంలో ప్రార్థనలతో ఈ రోజును ప్రారంభించాను. ఆయన నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలని, దేశానికి ఆయన నాయకత్వం కొనసాగాలని కోరుకున్నాను" అని ఆయన పేర్కొన్నారు. ప్రధాని మోదీ మార్గనిర్దేశంలో 'వికసిత భారత్' లక్ష్యాన్ని దేశం తప్పకుండా సాధిస్తుందని నారా లోకేశ్ ధీమా వ్యక్తం చేశారు. మన గొప్ప దేశానికి ఆయన నాయకత్వం ఎంతో కీలకమని అభిప్రాయపడ్డారు. దక్షిణాసియాలో తొలి 158 బిట్ క్వాంటమ్ కంప్యూటర్ జనవరిలో అమరావతికి రాబోతోందని లోకేశ్ అన్నారు. ప్రధాని మోదీ క్వాంటమ్ మిషన్‌ను ముందుండి నడిపించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com