LOKESH: "ఒకే రాష్ట్రం ఒకే రాజధాని"

LOKESH: ఒకే రాష్ట్రం ఒకే రాజధాని
X
స్పష్టం చేసిన మంత్రి నారా లోకేశ్

ఒకే రా­ష్ట్ర­మ­ని.. ఒకే రా­జ­ధా­ని అని తాము ఫి­క్స్ అయ్యా­మ­ని, అదే ని­నా­దం­తో ఎన్ని­క­ల­కు వె­ళ్లా­మ­ని, అధి­కా­రం­లో­కి వచ్చిన తర్వాత అదే చె­ప్పా­మ­ని మం­త్రి నారా లో­కే­శ్ అని తె­లి­పా­రు. రా­ష్ట్ర అసెం­బ్లీ­లో ఆయన మా­ట్లా­డు­తూ ఏపీ కే­పి­ట­ల్‌­పై స్ప­ష్టత ఇచ్చా­రు. అభి­వృ­ద్ధి వి­కేం­ద్రీ­క­ర­ణ­లో భా­గం­గా రా­ష్ట్రం­లో మొ­త్తం 22 చో­ట్ల కస్ట­ర్స్‌­ను గు­ర్తిం­చి­న­ట్లు తె­లి­పా­రు. అనం­త­పు­రం జి­ల్లా­లో ఆటో­మో­టి­వ్ క్ల­స్ట­ర్డ్, కర్నూ­లు జి­ల్లా­లో రె­న్యూ­వ­బు­ల్ ఎన­ర్జీ, సి­మెం­ట్ క్ల­స్ట­ర్డ్, కడప, చి­త్తూ­రు­లో ఎల­క్ట్రా­ని­క్స్ మే­ని­ప్యా­క్చ­ర్ క్ల­స్ట­ర్డ్, నె­ల్లూ­రు­లో గ్లా­స్, ఏసీ క్ల­స్ట­ర్డ్, ప్ర­కా­శం జి­ల్లా­లో కం­ప్రె­స్ బయో­గ్లా­స్, అమ­రా­వ­తి­లో క్వాం­ట­మ్ కం­ప్యూ­టిం­గ్, ఆక్వా క్ల­స్ట­ర్డ్‌­ను తీ­సు­కొ­స్తు­న్నా­మ­ని మం­త్రి నారా లో­కే­శ్ తె­లి­పా­రు. గత జగన్ ప్ర­భు­త్వం మూడు రా­జ­ధా­నుల ని­నా­దం­తో పాలన కొ­న­సా­గిం­చిన వి­ష­యం తె­లి­సిం­దే. అయి­తే ఈ వి­ధా­నం­పై తీ­వ్ర స్థా­యి­లో వ్య­తి­రే­కత వచ్చిం­ది. 2024లో జరి­గిన ఎన్ని­క­ల్లో ఘో­రం­గా 11 సీ­ట్ల­కు మిం­చి గె­ల­వ­లే­క­పో­యిం­ది. దీం­తో అసెం­బ్లీ ప్ర­తి­ప­క్ష హోదా సైతం దక్క­లే­దు.

ఏపీలో నైపుణ్యాభివృద్ధికి పెద్దపీట: మంత్రి లోకేశ్‌

కం­పె­నీల అవ­స­రా­ల­కు తగి­న­ట్లు చదు­వు­కు­న్న యు­వ­త­లో నై­పు­ణ్యా­లు పెం­చి ఉద్యో­గా­వ­కా­శాల కల్ప­న­కు చర్య­లు చే­ప­ట్టి­న­ట్లు మం­త్రి నారా లో­కే­శ్‌ తె­లి­పా­రు. రా­ష్ట్రం­లో యు­వ­త­కు నై­పు­ణ్యా­భి­వృ­ద్ధి శి­క్ష­ణ­పై శా­స­న­స­భ­లో ఎమ్మె­ల్యే­లు కన్నా లక్ష్మీ­నా­రా­యణ, యా­ర్ల­గ­డ్డ వెం­క­ట్రా­వు అడి­గిన ప్ర­శ్న­కు మం­త్రి సమా­ధా­న­మి­చ్చా­రు. ఐదే­ళ్ల­లో 20 లక్షల ఉద్యో­గా­లు కల్పి­స్తా­మ­న్న హామీ మే­ర­కు రా­ష్ట్రం­లో నై­పు­ణ్యా­భి­వృ­ద్ధి­కి పె­ద్ద­పీట వే­స్తు­న్న­ట్లు చె­ప్పా­రు. క్ల­స్ట­ర్ ఆధా­రం­గా ఉద్యో­గా­వ­కా­శా­లు కల్పి­స్తు­న్నా­మ­ని.. రా­య­ల­సీమ, ఉత్త­రాం­ధ్ర జి­ల్లా­ల్లో 22 క్ల­స్ట­ర్లు ఏర్పా­టు­చే­శా­మ­ని వి­వ­రిం­చా­రు. తయారీ, సేవా రంగాలను గుర్తించి.. అందుకు ఉత్పత్తులు, ఉపకరణాలు, విడి భాగాలు ఒకేచోట తయారయ్యేలా ప్రణాళికలు రూపొందించామని మంత్రి లోకేశ్‌ తెలిపారు. ఉద్యోగాల కల్పనకు సంబంధిత మంత్రులతో ఉప సంఘం ఏర్పాటుచేశామని.. సెక్టార్ల వారీగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు గుర్తించి ఆ రంగంలో నైపుణ్యాభివృద్ధి కోసం చర్యలు చేపట్టామన్నారు. సాంకేతికత పెరిగిన సమయంలో బైక్, కార్ మెకానిక్‌లు కూడా కొత్త టెక్నాలజీపై అవగాహన పెంచుకోవాలన్నారు.

Tags

Next Story