Lokesh Padayatra: లోకేష్ పాదయాత్ర.. పలమనేరులో హైటెన్షన్

Lokesh Padayatra: పలమనేరులో హైటెన్షన్ నెలకొంది. లోకేష్ ప్రచార వాహనాన్ని పోలీసులు అడ్డుకున్నారు. వాహనాన్ని సీజ్ చేసేందుకు ప్రయత్నించడంతో ఉద్రిక్తత నెలకొంది. ప్రచార వాహనానికి అనుమతి లేదని పోలీసులు చెబుతున్నారు. అటు పోలీసులతో టీడీపీ శ్రేణులు వాగ్వాదానికి దిగాయి. ప్రచార వాహనం ముందు బైటాయించి నిరసన తెలుపుతున్నాయి.
సీఎం డౌన్ డౌన్ అంటూ టీడీపీ శ్రేణుల నినాదాలు చేస్తున్నాయి. పోలీసుల ఆంక్షలపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. లోకేష్ ప్రచార వాహనాన్ని అడ్డుకోవడంపై ధ్వజమెత్తారు. అనుమతి లేకుండా వాహనాన్ని ఉపయోగించారని డీఎస్పీ అంటున్నారు.
దీంతో వాహనం వద్ద బైఠాయించి టీడీపీ నేతలు, కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. ఎందుకు అడ్డుకున్నారంటూ మండిపడ్డారు. పోలీసులు - టీడీపీ నేతల మధ్య వాగ్వాదం తలెత్తింది. కొద్దిసేపు పాదయాత్రకు ఆటంకం ఏర్పడింది. పలమనేరు టవర్ క్లాక్ వద్ద.. సీఎం డౌన్‌డౌన్ అంటూ టీడీపీ కార్యకర్తలు నినాదాలు చేశారు. ప్రస్తుతం పలమనేరు పరిధిలో లోకేష్ పాదయాత్ర కొనసాగుతుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com