Yuvagalam: పత్తికొండ నియోజకవర్గంలో లోకేష్..

Yuvagalam: పత్తికొండ నియోజకవర్గంలో లోకేష్..
లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర 72వ రోజుకు చేరుకుంది. ఇప్పటి వరకు 917 కిలో మీటర్ల పాదయాత్ర పూర్తి అయ్యింది

ఏపీలో నారా లోకేష్ ప్రభంజనం కొనసాగుతుంది. పాదయాత్రలో యువనేత ఎక్కడికి వెళ్లిన ఘన స్వాగతం లభిస్తోంది. వైసీపీ పాలనలో తాము ఎదుర్కొంటున్న కష్టాలను లోకేష్‌కు చెప్పుకుంటున్నారు. అందరి సమస్యలు ఓపికగా వింటున్న లోకేష్.. టీడీపీ అధికారంలోకి రాగానే అన్ని సమస్యలు పరిష్కరిస్తామని భరోసా ఇస్తూ ముందుకు సాగుతున్నారు.

లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర 72వ రోజుకు చేరుకుంది. ఇప్పటి వరకు 917 కిలో మీటర్ల పాదయాత్ర పూర్తి అయ్యింది. ఇవాళ ఉదయం పత్తికొండ నియోజకవర్గంలో లోకేష్ పాదయాత్ర కొనసాగనుంది. సాయంత్రానికి ఆలూరు నియోజకవర్గంలోకి ఎంట్రీ ఇవ్వనుంది. రాంపిల్లి శివారు క్యాంప్ సైట్ నుంచి పాదయాత్ర ప్రారంభం కానుంది. ఉదయం 8గంటలకు రాంపిల్లిలో మహిళలతో లోకేష్‌ సమావేశం అవుతారు. 9.30 నిమిషాలకు ఆర్ఎస్ పెండేకల్లులో స్థానికులతో భేటీ కానున్నారు. 9.50 నిమిషాలకు రాంకొండ క్రాస్ వద్ద యువకులతో సమావేశం అవుతారు. అనంతరం 11.15 నిమిషాలకు మారెళ్లలో రైతులతో 11.55 నిమిషాలకు మారెళ్ల శివార్లలో బీసీలతో ముఖాముఖిలో పాల్గొంటారు.

మధ్యాహ్నం 12.55 – మారెళ్ల శివార్లలో భోజన విరామం తీసుకుంటారు నారా లోకేష్. ఇక సాయంత్రం 4గంటలకు మారెళ్ల శివార్ల నుంచి పాదయాత్ర తిరిగి ప్రారంభం అవుతుంది. 5.30నిమిషాలకు నల్లగుండ్లలో తాండా మహిళలతో సమావేశం కానున్నారు. 7.10 నిమిషాలకు ఆలూరు నియోజకవర్గంలోకి లోకేష్‌ పాదయాత్ర ఎట్రీ ఇస్తోంది. ఇక ఎం.కె కొట్టాల వద్ద స్థానికులతో మాటామంతీలో పాల్గొనున్న లోకేష్‌ రాత్రికి అక్కడే ఏర్పాటు చేసిన విడిది కేంద్రంలో బస చేస్తారు.

Tags

Read MoreRead Less
Next Story