LOKESH: "చిరు వ్యాపారి వలీని త్వరలో కలుస్తా"

సామాజిక ఐక్యతకు భంగం కలిగించే చర్యలను తాను సమర్థించనని స్పష్టం చేస్తూ, కర్నూలుకు చెందిన చిన్న వ్యాపారి వలీకి అండగా నిలుస్తానని ఏపీ మంత్రి నారా లోకేశ్ తెలిపారు. ఈ విషయాన్ని ఆయన ‘ఎక్స్’ వేదికగా పంచుకున్నారు. వలీ తయారు చేసిన కోవా బన్ రుచి చూడాలనే ఆసక్తి వ్యక్తం చేస్తూనే, ఆయనపై కొన్ని వర్గాలు చేసిన ఆరోపణలు తనను కలచివేశాయని పేర్కొన్నారు. చిరు వ్యాపారిగా జీవనోపాధి సాగిస్తున్న వలీపై అనవసర విమర్శలు చేయడం సమాజానికి మేలు చేయదని లోకేశ్ అభిప్రాయపడ్డారు. ఐక్యతను దెబ్బతీసే ప్రవర్తనకు మన సమాజంలో స్థానం లేదని స్పష్టం చేశారు. త్వరలోనే వలీని స్వయంగా కలిసి, అతనికి మద్దతు తెలియజేస్తానని వెల్లడించారు. సామాజిక సమరసతను కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత అని, చిన్న వ్యాపారుల మనోభావాలను దెబ్బతీయకుండా ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
