lokesh: రప్ప రప్పా అంటే పోలీసులు రఫ్ఫాడిస్తారు: లోకేశ్

lokesh:  రప్ప రప్పా అంటే పోలీసులు రఫ్ఫాడిస్తారు: లోకేశ్
X
గిరిజన యువకుడిపై దాడిపై స్పందించిన నారా లోకేశ్

వై­సీ­పీ మాజీ ఎమ్మె­ల్యే భూమన కరు­ణా­క­ర­రె­డ్డి అను­చ­రు­లు రె­చ్చి­పో­యా­రు. తి­రు­ప­తి­లో­ని శ్రీ­ని­వా­సం వస­తి­గృ­హం ఎదు­రు­గా ఉన్న దు­కా­ణం కాం­ట్రా­క్ట్‌­ను తనకు రా­సి­వ్వా­లం­టూ వై­సీ­పీ సో­ష­ల్‌ మీ­డి­యా ఇన్‌­ఛా­ర్జి అని­ల్ రె­డ్డి దౌ­ర్జ­న్యా­ని­కి ది­గా­డు. పవ­న్‌ అనే గి­రి­జన యు­వ­కు­డి­ని కి­డ్నా­ప్ చేసి ఎం­ఆ­ర్‌­ప­ల్లి­లో­ని తన ఇం­ట్లో బం­ధిం­చి తీ­వ్రం­గా హిం­సిం­చా­రు. గి­రి­జన యు­వ­కు­డి­ని చి­త­క­బా­దు­తుం­డ­గా అని­ల్ రె­డ్డి స్నే­హి­తు­లు వీ­డి­యో తీ­య­గా వై­ర­ల్‌­గా మా­రిం­ది. కా­ర్‌ డె­కా­ర్స్‌­కు సం­బం­ధిం­చిన దు­కా­ణం తనకు ఇవ్వా­లం­టూ భూమన ప్ర­ధాన అను­చ­రు­డు చై­త­న్య యా­ద­వ్‌ ఓ వ్య­క్తి­పై దా­డి­కి ది­గిన ఘటన మరు­వక ముం­దే ఈ దా­రు­ణం వె­లు­గు­లో­కి వచ్చిం­ది. అని­ల్ రె­డ్డి.. బా­ధి­తు­డి­ని చి­త్ర­హిం­స­లు పె­ట్టా­డు. పవ­న్​­ను కి­డ్నా­ప్ చేసి బు­ధ­వా­రం తి­రు­ప­తి­లో­ని ఎం­ఆ­ర్‌­ప­ల్లి­లో­ని తన ఇం­ట్లో బం­ధిం­చి వి­చ­క్ష­ణా­ర­హి­తం­గా దాడి చే­శా­రు. గి­రి­జన యు­వ­కు­డి­ని చి­త­క­బా­దు­తుం­డ­గా అని­ల్ రె­డ్డి స్నే­హి­తు­లు వీ­డి­యో తీ­శా­రు. అన్నా వది­లే­యం­డి అంటూ యు­వ­కు­డు కా­ళ్లా­వే­ళ్లా పడ్డా కని­క­రిం­చ­లే­దు. మరింత రె­చ్చి­పో­యి రక్తం కళ్ల­జూ­స్తూ రా­క్ష­సా­నం­దం పొం­దా­రు. ఈ వీ­డి­యో సో­ష­ల్‌ మీ­డి­యా­లో వై­ర­ల్‌­గా మా­రిం­ది.

పోలీసులు రఫ్ఫాడిస్తారు: లోకేశ్

తి­రు­ప­తి లో యు­వ­కు­డి­పై వై­సీ­పీ­కి చెం­దిన వ్య­క్తు­లు దాడి చే­సిన ఘట­న­కు సం­బం­ధిం­చి మం­త్రి నారా లో­కే­ష్ స్పం­దిం­చా­రు. ' ప్ర­జ­లు ఛీ­త్క­రిం­చి­నా వై­సీ­పీ నా­య­కుల బు­ద్ధి మా­ర­డం లే­ద­ని తీ­వ్రం­గా స్పం­దిం­చా­రు. అధి­కా­రం­లో ఉన్న­ప్పు­డు డా­క్ట­ర్ సు­ధా­క­ర్ గారి దగ్గర నుం­చి డ్రై­వ­ర్ సు­బ్ర­హ్మ­ణ్యం డెడ్ బాడీ డోర్ డె­లి­వ­రీ వరకూ దళి­తు­ల­పై వై­సీ­పీ నా­య­కు­లు దమ­న­కాండ చే­శా­ర­న్నా­రు. రప­ర­పా అంటే పో­లీ­సు­లు రఫ్ఫా­డి­స్తా­ర­ని లో­కే­శ్ హె­చ్చ­రిం­చా­రు.

Tags

Next Story