LOKESH: 'స్కూళ్ల దత్తత' – నారా లోకేష్ వినూత్న ఆలోచన

LOKESH: స్కూళ్ల దత్తత – నారా లోకేష్ వినూత్న ఆలోచన
X
ప్రభుత్వ స్కూళ్ల దత్తత పథకం సిద్ధం!.. మౌలిక సదుపాయాల కోసం లోకేష్ వినూత్న ఆలోచన.. నాడు–నేడు”లో విఫలం… కొత్త ప్లాన్ రెడీ

ఆం­ధ్ర­ప్ర­దే­శ్‌­లో వి­ద్యా రం­గా­న్ని అభి­వృ­ద్ధి పరచి ప్ర­భు­త్వ స్కూ­ళ్ల స్థా­యి­ని పెం­చా­ల­ని వి­ద్యా మం­త్రి నారా లో­కే­ష్ కృషి చే­స్తు­న్నా­రు. ఈ ది­శ­గా ఆయన చే­ప­ట్టిన తాజా ఆలో­చన స్కూ­ళ్ల దత్తత. గత ప్ర­భు­త్వం­లో “నాడు–నేడు” పే­రు­తో వేల కో­ట్లు ఖర్చు చే­సి­నా, ఫలి­తం­గా కొ­న్ని కు­ర్చీ­లు, గో­డ­ల­కు రం­గు­లు తప్పి­తే పె­ద్ద­గా మా­ర్పు రా­లే­ద­ని వి­మ­ర్శ­లు వచ్చా­యి. వి­ద్యా­ర్థు­ల­కు కా­వా­ల్సిన మౌ­లిక సదు­పా­యా­లు మా­త్రం అం­దు­బా­టు­లో­కి రా­లే­దు. ఈ లో­టు­ను పూ­డ్చ­డ­మే లక్ష్యం­గా లో­కే­ష్ కొ­త్త ప్ర­ణా­ళిక సి­ద్ధం చే­శా­రు. దేశ వి­దే­శా­ల్లో స్థి­ర­ప­డిన వారు, అలా­గే తమ కె­రీ­ర్‌­లో ఎది­గిన ప్ర­ము­ఖు­లు ఎక్కు­వ­గా ప్ర­భు­త్వ స్కూ­ళ్ల­లో­నే చది­వా­రు. వా­ళ్ల­కు తాము చది­విన పా­ఠ­శా­లల పట్ల ఓ అను­బం­ధం ఉం­టుం­ది. అయి­తే, వారు సహా­యం చే­యా­ల­ను­కు­న్నా సరైన మా­ర్గం తె­లి­యక వి­ర­మిం­చే­వా­రు. ఈ సమ­స్య­కు శా­శ్వత పరి­ష్కా­రం చూ­పేం­దు­కు, ఆస­క్తి­గల వారు తమ గ్రా­మా­ల్లో­ని స్కూ­ళ్ల­ను దత్తత తీ­సు­కు­నే­లా ప్ర­త్యేక వె­బ్‌­సై­ట్ ఏర్పా­టు చే­యా­ల­ని నారా లో­కే­ష్ అధి­కా­రు­ల­కు ఆదే­శిం­చా­రు.

ఆ వె­బ్‌­సై­ట్‌­లో ఆయా స్కూ­ళ్ల­కు అవ­స­ర­మైన మౌ­లిక సదు­పా­యా­లు, ప్ర­స్తుత పరి­స్థి­తి వి­వ­రా­లు అం­దు­బా­టు­లో ఉం­టా­యి. దా­త­లు లేదా పూ­ర్వ­వి­ద్యా­ర్థు­లు వా­టి­ని చూసి సహా­యం చే­య­వ­చ్చు. ఇదే కా­కుం­డా, జా­తీ­య­స్థా­యి­లో ఉన్న ప్ర­ముఖ కా­ర్పొ­రే­ట్ సం­స్థల సహ­కా­రా­న్ని కూడా వి­ద్యా రంగం అభి­వృ­ద్ధి­కి వి­ని­యో­గిం­చా­ల­న్న ఆలో­చ­న­లో లో­కే­ష్ ఉన్నా­రు. వి­ద్యా వ్య­వ­స్థ­లో సం­స్క­ర­ణ­లు వే­గం­గా అమలు కా­వా­ల­ని, అం­దు­కు కొ­త్త ని­ర్ణ­యా­లు తీ­సు­కో­వ­డం­లో ఆయన వె­ను­కా­డ­డం లేదు. ము­ఖ్యం­గా, ప్ర­తి సం­వ­త్స­రం డీ­ఎ­స్సీ ని­ర్వ­హిం­చా­ల­నే ని­ర్ణ­యం ఉపా­ధ్యా­యుల ని­యా­మ­కా­ని­కి దా­రి­తీ­స్తుం­ది. ఈ వి­ధం­గా ప్ర­భు­త్వ పా­ఠ­శా­ల­లు బలో­పే­తం కా­వ­డం మా­త్ర­మే కా­కుం­డా, వి­ద్యా­ర్థు­లు మె­రు­గైన వా­తా­వ­ర­ణం­లో చది­వే అవ­కా­శం దక్కు­తుం­ది. ఒక వైపు ప్ర­భు­త్వ ని­ధు­లు, మరో­వై­పు ప్ర­జల సహ­కా­రం కలి­స్తే, రా­ష్ట్ర వి­ద్యా రంగం కొ­త్త ది­శ­లో ప్ర­యా­ణి­స్తుం­ద­ని నారా లో­కే­ష్ నమ్ము­తు­న్నా­రు.

Tags

Next Story