అపర భగీరథుడు చంద్రబాబు నాయుడు- లోకేష్‌

అపర భగీరథుడు చంద్రబాబు నాయుడు- లోకేష్‌
దార్శనికుడు చంద్రబాబు ముందుచూపుకు నిదర్శనం పట్టిసీమ

దేశచరిత్రలో తొలిసారిగా పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా గోదావరి-కృష్ణా నదుల అనుసంధానానికి శ్రీకారం చుట్టిన అపర భగరీథుడు చంద్రన్న అని లోకేష్‌ తెలిపారు. ఇది గన్నవరం నియోజకవర్గం రంగన్నగూడెం వద్ద గల పట్టిసీమ కాలువ అంటూ లోకేష్‌ సెల్ఫీ దిగారు. కృష్ణా డెల్టాలో రైతుల కష్టాలు తీర్చేందుకు కేవలం 11నెలల వ్యధిలో 13వందల 60 కోట్ల వ్యయంతో 2016లో ఈ ప్రాజెక్టును పూర్తిచేశారన్నారు. రికార్డు సమయంలో పూర్తయిన ప్రాజెక్టుగా కూడా పట్టిసీమ లిమ్కా బుక్ అఫ్ రికార్డ్స్‌లో స్థానం పొందిందని చెప్పారు.

పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాలోని రైతులకు ఖరీఫ్ సీజన్‌లో పుష్కలంగా సాగునీరు అందించే లక్ష్యంతో చేపట్టగా, ఈ ప్రాజెక్టు ఫలితాలను 2016-19 నడుమ మూడు సీజన్లలో రైతులు కళ్లారా చూశారన్నారు. రోజూ గరిష్టంగా 8వేల500 క్యూసెక్కుల నీటిని తీసుకునేలా డిజైన్ చేసిన పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా ప్రతిఏటా 100 టీఎంసీల మిగులు జలాలను.. గోదావరి నుంచి కృష్ణానదికి తీసుకునే అవకాశముందన్నారు. నాడు దండగ అన్న జగన్‌కు నేడు పట్టిసీమే దిక్కయిందని అన్నారు. నాలుగేళ్లుగా ఈ ప్రాజెక్టును పట్టించుకోలేదని మండిపడ్డారు.

Tags

Read MoreRead Less
Next Story