LOKESH: రెడ్‌ బుక్ తన పని తాను చేసుకుపోతోంది

LOKESH: రెడ్‌ బుక్ తన పని తాను చేసుకుపోతోంది
X
ప్రవాసాంధ్రులను గుండెల్లో పెట్టుకుంటాం

"రెడ్‌బుక్ తన పని తాను చేసుకుపోతోంది. చట్టాన్ని ఉల్లంఘించిన ఎవరినీ వదిలిపెట్టేది లేదు. మేం ఎలాంటి కక్షసాధింపులకు పాల్పడటం లేదు.” అని నారా లోకేశ్ స్పష్టం చేశార. తె­లు­గు­వా­ళ్లు దశా­బ్దాల క్రి­త­మే అమె­రి­కా­కు వచ్చా­ర­ని ఏపీ మం­త్రి నారా లో­కే­శ్‌ అన్నా­రు. డా­ల­స్‌­లో ని­ర్వ­హిం­చిన తె­లు­గు డయా­స్పో­రా సమా­వే­శం­లో ఆయన పా­ల్గొ­ని మా­ట్లా­డా­రు. ‘‘అమె­రి­కా­లో తె­లు­గు­వా­ళ్లు సత్తా చా­టా­రు. మాకు అం­డ­గా ని­లి­చిన ప్ర­వా­సాం­ధ్రు­ల­ను గుం­డె­ల్లో పె­ట్టు­కుం­టాం. కష్ట­కా­లం­లో మీ­రం­తా మా కు­టుం­బా­ని­కి అం­డ­గా ని­లి­చా­రు. స్పీ­డ్‌­కు ఆం­ధ్ర­ప్ర­దే­శ్ బ్రాం­డ్ అం­బా­సి­డ­ర్‌­గా మా­రిం­ది. 20 లక్షల ఉద్యో­గా­లు కల్పిం­చా­ల­న్న­దే కూ­ట­మి ప్ర­భు­త్వ లక్ష్యం. వా­ళ్లు వై నాట్ 175 అన్నా­రు.. ప్ర­జ­లు మా­త్రం వై నాట్ 11 అన్నా­రు. ప్ర­వా­సాం­ధ్రు­ల­కు ఏ కష్టం వచ్చి­నా ఏపీ­ఎ­న్ఆ­ర్టీ అం­డ­గా ఉం­టుం­ది. వి­డా­కు­లు, మిస్ ఫై­ర్‌­లు, క్రా­స్ ఫై­ర్‌­లు లే­కుం­డా ఎన్డీ­యే కూ­ట­మి మరో 15 ఏళ్లు రా­ష్ట్రా­న్ని ముం­దు­కు తీ­సు­కు­వె­ళ్తుం­ది. రె­డ్‌­బు­క్ తన పని తాను చే­సు­కు­పో­తోం­ది. చట్టా­న్ని ఉల్లం­ఘిం­చిన ఎవ­రి­నీ వది­లి­పె­ట్టే­ది లేదు. మేం ఎలాం­టి కక్ష­సా­ధిం­పు­ల­కు పా­ల్ప­డ­టం లేదు. చం­ద్ర­బా­బు­ని 53 రో­జు­లు పాటు అక్ర­మం­గా జై­లు­లో ఉం­చి­న­ప్పు­డు అమె­రి­కా­లో­ని ప్ర­వా­సాం­ధ్రు­లు పె­ద్దఎ­త్తున బయ­ట­కు వచ్చి మాకు అం­డ­గా ని­లి­చా­రు. 2019 నుం­చి 2024 వరకు ఎం­త­టి వి­ధ్వంస పాలన జరి­గిం­దో అం­ద­రి­కీ తె­లు­సు. అం­దు­కే సి­ద్ధం సి­ద్ధం అని బయ­లు­దే­రిన పా­ర్టీ­ని ప్ర­జ­లు భూ­స్థా­పి­తం చే­శా­రు. అని నారా లో­కే­శ్ వె­ల్ల­డిం­చా­రు.

ప్ర­వా­సాం­ధ్రుల మద్ద­తు­తో కూ­ట­మి సూ­ప­ర్ హిట్ అయిం­ది. రా­బో­యే రో­జు­ల్లో రి­కా­ర్డు­లు కూడా తి­ర­గ­రా­స్తాం. దే­శం­లో అనేక రా­ష్ట్రా­ల్లో డబు­ల్ ఇం­జ­న్ సర్కా­ర్‌­లు ఉంటే.. ఒక్క ఏపీ­లో­నే డబు­ల్ ఇం­జ­న్ బు­ల్లె­ట్ ట్రై­న్ సర్కా­ర్ ఉంది. ఒకే రా­ష్ట్రం-ఒకే రా­జ­ధా­ని, అభి­వృ­ద్ధి వి­కేం­ద్రీ­క­రణ మా ని­నా­దం. రా­ష్ట్రం­లో మరో పది­హే­నే­ళ్లు కూ­ట­మి ప్ర­భు­త్వం అధి­కా­రం­లో ఉం­డ­టం ఖాయం’’ అని లో­కే­శ్ అన్నా­రు. గత ఎన్ని­క­ల్లో కూ­ట­మి వి­జ­యా­ని­కి కృషి చే­సి­నం­దు­కు ప్ర­వా­సాం­ధ్రు­ల­కు ఆయన ధన్య­వా­దా­లు తె­లి­పేం­దు­కు ఈ వే­ది­క­ను వి­ని­యో­గిం­చ­ను­న్నా­రు. ఈ సమా­వే­శం­లో పా­ల్గొ­న్న వా­రి­కి ఉచిత భో­జ­నం­తో పాటు లో­కే­శ్‌­తో ఫొటో దిగే అవ­కా­శం కల్పి­స్తు­న్నా­రు. ఏపీ ఎగు­మ­తు­లు - ది­గు­మ­తుల వా­ణి­జ్యా­న్ని బలో­పే­తం చేసే పె­ట్టు­బ­డు­ల­ను ఆక­ర్షిం­చే లక్ష్యం­తో లో­కే­శ్ సోమ, మం­గ­ళ­వా­రా­ల్లో శా­న్‌­ఫ్రా­న్సి­స్కో­లో పర్య­టి­స్తా­రు. ఆయన పర్య­టన ఏర్పా­ట్ల­ను ఏపీ ఎన్ఆ­ర్‌­టీ చై­ర్మ­న్ డా.వే­మూ­రు రవి­కు­మా­ర్, ఎన్నా­రై టీ­డీ­పీ సమ­న్వ­య­క­ర్త కో­మ­టి జయ­రాం, ఎన్నా­రై లో­కే­శ్ నా­యు­డు కొ­ణి­దెల, రా­జా­పి­ల్లి, సతీ­ష్ మం­డువ, తది­త­రు­లు సమ­న్వ­య­ప­రు­స్తు­న్నా­రు.

Tags

Next Story