యువనేతకు జననీరాజనాలు

యువనేతకు జననీరాజనాలు
వైసీపీ పాలనలో వారు పడుతున్న కష్టాలను చెప్పుకుంటున్నారు.

నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రకు విశేష స్పందన వస్తుంది. వేలాది మంది లోకేష్ వెంట కదులుతున్నారు. యువనేత ఎక్కడికి వెళ్లిన జననీరాజనం లభిస్తోంది. అడుగడుగునా ఘన స్వాగతాలు పలుకుతున్నారు. మహిళలు మంగళ హారతులతతో స్వాగతం పలుకుతూ.. వైసీపీ పాలనలో వారు పడుతున్న కష్టాలను చెప్పుకుంటున్నారు. అందరి సమస్యలను వింటున్న లోకేష్‌.. వచ్చేది టీడీపీ ప్రభుత్వమేనని.. త్వరలోనే అన్ని సమస్యలు పరిష్కరిస్తానని భరోసా ఇస్తూ ముందుకు సాగుతున్నారు.

పాదయాత్రలో భాగంగా బద్వేలు ఫారెస్ట్‌ రేంజి-1లో యువతతో సమావేశం కారున్నారు లోకేష్‌. వారి సమస్యలు అడిగి తెలుసుకోనున్నారు. అనంతరం పాదయాత్రగా బద్వేలు ఫారెస్ట్ రేంజి-2కు వెళ్లి.. అక్కడ మహిళలతో భేటీ అవుతారు. అక్కడి నుంచి నేరుగా బద్వేలు ఫారెస్ట్ రేంజి-3 కి చేరుకుని రైతులతో సమావేశం కానున్నారు. సమావేశం అనంతరం లోకేష్‌ పాదయాత్ర ఉమ్మడి నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలోకి ఎంట్రీ ఇవ్వనుంది. కదిరినాయుడుపల్లెలో స్థానికులతో సమావేశం అయి వారి సమస్యలు తెలుసుకోనున్నారు లోకేష్‌. అనంతరం పాదయాత్రగా నాయుడుపల్లె శివారు విడిది కేంద్రానికి చేరుకుంటారు. ఇక్కడితో 125వ రోజు యువగళం పాయాత్ర ముగుస్తోంది. రాత్రికి లోకేష్ అక్కడే బస చేస్తారు.

Tags

Read MoreRead Less
Next Story