Yuvagalam: లోకేష్ రాకతో.. సింహానాదం చేసిన సింహాపురి

సింహాపురి గడ్డ సింహానాదం చేసింది. యువనేత లోకేష్ రాకతో ఉదయగిరికి జన సంద్రం పోటెత్తింది. యాత్రకు అడుగడుగునా జనహారతి పట్టారు. లోకేష్ తో కరచాలనం చేసేందుకు..సెల్ఫీలు దిగేందుకు పోటీ పడ్డారు. అడుగడుగునా హారతులు పడుతున్నారు. జై లోకేష్, జై టీడీపీ నినాదాలతో ఉదయగిరి మార్మోగిపోయింది.
ఇక 154వ రోజు యువగళం పాదయాత్ర ఉదయం 8 గంటలకు ఉదయగిరి నియోజకవర్గంలోని చోడవరం శివారులోని క్యాంప్ సైట్ నుంచి యువనేత లోకేష్ పాదయాత్ర ప్రారంభమైంది. లోకేష్‌కు అడుగడుగునా జనహారతి పడుతున్నారు. జై లోకేష్, జై టీడీపీ నినాదాలతో ఉదయగిరి మార్మోగింది. కాసేపట్లో రామానుజపురం క్రాస్ దగ్గర స్థానికులతో సమావేశం కానున్నారు యువనేత. ఆ తర్వాత సత్యవోలు అగ్రహారం వాసులతో సమావేశం కానున్నారు. ఇక మధ్యాహ్నం 12.30 ఎర్రబాలెంలో యువగళం పాదయాత్రకు భోజన విరామం ఇవ్వనున్నారు. తిరిగి మధ్యాహ్నం మూడు గంటలకు పాదయాత్ర తిరిగి ప్రారంభం కానుంది. సాయంత్రం 5.45కి కొండాపురంలో జరిగే బహిరంగ సభలో లోకేష్ ప్రసంగించనున్నరు. రాత్రికి కొండాపురం శివారు విడిది కేంద్రంలో బసచేయనున్నరు లోకేష్.
మరోవైపు తాము అధికారంలోకి వస్తే యువత కోసం చేపట్టబోయే కార్యక్రమాలను తన పాదయాత్రలో లోకేష్ వివరిస్తున్నారు. టీడీపీ అధినేత ప్రకటించిన మినీ మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. వైసీపీ సర్కార్ అక్రమాలు,అవినీతిపై ప్రశ్నిస్తూ జగన్‌పై మాటల తూటాలను పేలుస్తున్నారు లోకేష్.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com