Yuvagalam: ప్రవాహం నుంచి..సునామీగా మారిన లోకేష్ యువగళం పాదయాత్ర

ఇప్పుడు ఏపీ ప్రజలకు ఓ భరోసా కావాలి. ఓ ధైర్యం కావాలి. ఇలాంటి పరిస్థితుల్లోనే టీడీపీ యువ నాయకుడు నారా లోకేష్ నేనున్నానంటూ ప్రజలకు భరోసా ఇచ్చేందుకు పాదయాత్రకు సంకల్పించారు. కుప్పం నుంచి ఇచ్చాపురం వరకూ ఆయన పాదయాత్ర చేస్తున్నారు. కేవలం నడవడం కాదు.. పరిస్థితులను లోకేష్ మరింత లోతుగా అధ్యయనం చేస్తున్నారు.సమస్యలకు పరిష్కారంగా మారుతున్నారు లోకేష్.పాదయాత్ర..ప్రవాహంలా ప్రారంభమైన టీడీపీ యువ నేత లోకేశ్ పాదయాత్ర 200 రోజుల్లో సమరోత్సాహంతో సునామీలా మారింది.దేనికైనా సై అంటూ రాజకీయంగా తనను తాను తీర్చిదిద్దుకున్న లోకేష్..నాయకుడి నుంచి ప్రజల ఆశాకిరణంగా ఎదిగారు. భవిష్యత్తుకు నమ్మకమైన నేతగా జనం మనసు గెలుచుకొని..వారంతా తన వెంట నడిచే విశ్వాసం సంపాదించుకున్నారు.
అధికార పార్టీ నేతల వెన్నులో వణుకు పుట్టించే జన జాతరగా మారింది యువగళం పాదయాత్ర చిత్తూరు జిల్లా కుప్పంలో జనవరి 27న ప్రసన్న వరదరాజస్వామి ఆలయం నుంచి ప్రారంభమైన లోకేశ్ పాదయాత్ర ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం నియోజకవర్గంలో 200 రోజుల మైలురాయిని చేరింది. అభిమానుల తాకిడితో చేతులకు గాయాలైనా.. భుజం నొప్పి బాధిస్తున్నా ఒక్కరోజూ విశ్రాంతి తీసుకోకుండా, విరామం ఇవ్వకుండా లోకేశ్ యాత్రను సాగిస్తుండడం చూస్తుంటేనే అర్ధమవుతుంది ఆయన కమిట్‌మెంట్. 77 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 2వేల710 కిలోమీటర్ల మేర జరిగింది.185 మండలాలు ఒక వేయి 675 గ్రామాల మీదుగా సాగింది.
రోజుకు దాదాపు 14 కిలోమీటర్ల దూరం ఆయన నడుస్తున్నారు. ఒక రోజు రికార్డు స్థాయిలో 22 కిలోమీటర్లు నడిచారు. ఈ 200 రోజుల్లో మొత్తం 64 బహిరంగ సభల్లో ప్రసంగించారు. 132 ముఖాముఖి సమావేశాలు, 8 రచ్చబండ సమావేశాలు, పది ప్రత్యేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. 4వేలకు పైగా వినతిపత్రాలు అందాయి. వ్యక్తిగతంగా కలిసి సమస్యలు చెప్పుకొన్నవారు వేల సంఖ్యలో ఉన్నారు. విజయవాడలో జరిగిన పాదయాత్ర సంచలనంగా నిలిచింది. తెల్లవారు జామున మూడున్నర వరకూ ఆయన కోసం ఎదురు చూస్తూ ప్రజలు రోడ్లపై నిలబడ్డారు.
ఇక లోకేశ్‌తో ఫొటోలు దిగడానికి తండోపతండాలు తరలివస్తున్నారు.సెల్ఫీ విత్ లోకేశ్ పేరుతో రోజుకు వేయిమందికి పైగా సెల్ఫీ దిగుతున్నారు. ఒక్కోరోజు 2వేల మంది కూడా లోకేష్‌తో సెల్ఫీ దిగేందుకు బారులు తీరుతున్నారు.మొత్తమ్మీద ఇప్పటివరకూ ఆయనతో దాదాపు 3లక్షల మంది సెల్ఫీలు దిగారు. దీంతో అప్పుడప్పుడూ భుజం నొప్పి వస్తోంది. అయినా భరిస్తున్నారు. సెల్ఫీ కార్యక్రమం ఎత్తివేయాలని వైద్యులు చెప్పినా ఆపడం లేదు.
మరోవైపు లోకేశ్ పదునైన ప్రసంగాలతో ప్రత్యర్థులపై దాడి చేస్తూ..పొలిటికల్ హీట్ పుట్టించారు. రాయలసీమలో అనేకచోట్ల అధికార పార్టీ ఎమ్మెల్యేల అవినీతి అక్రమాలను, అధికార దుర్వినియోగాన్ని ఆధారాలతో ఎత్తిచూపారు.నాలుగేళ్ల జగన్ ప్రభుత్వ పాలనా వైఫల్యాలను ఎండగట్టడంతోపాటు స్థానిక నేతల అక్రమాలను ప్రజల ముందుకు తెచ్చారు. దీంతో అనేక నియోజకవర్గాల్లో వైసీపీ ఎమ్మెల్యేలు వివరణలు ఇవ్వాల్సి వచ్చింది. వివరణలు ఇవ్వలేకపోతే లోకేశ్‌పై వ్యక్తిగత విమర్శలకు దిగారు. లోకేశ్ విమర్శల దాడి.. పాదయాత్రకు వస్తున్న స్పందనతో కలవరపడ్డ అధికార పార్టీ పోలీసు కేసులతో అడుగడుగునా అడ్డుకునే ప్రయత్నం చేశారు. కొన్ని నియోజకవర్గాల్లో వైసీపీ కార్యకర్తలు.. టీడీపీ కార్యకర్తలపై దాడులకు దిగారు.
తిరిగి వారిపైనే కేసులు పెట్టారు. ఏకంగా గన్నవరంలో 46 మంది కీలక నేతలపై కేసులు పెట్టారు.చివరకు విదేశాల్లో ఉన్నవారిపైనా కేసులు నమోదయ్యాయి. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ప్రతి 20 కిలోమీటర్లకు ఒకటి చొప్పున మొత్తం 25 కేసులు పెట్టారు. లోకేశ్‌పైనే 3కేసులు పెట్టారు. ఆయన ప్రచార రథం, సౌండ్ సిస్టం.. చివరకు స్టూల్‌ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పాదయాత్రను స్వాగతిస్తూ ఏర్పాటుచేసిన ఫ్లెక్సీలు చించడం, రాళ్లు రువ్వడం, టీడీపీ కార్యకర్తలు తిరగబడితే పారిపోవడం ఆనవాయితీగా మారింది.
ఇక పాదయాత్రలో అనేక వర్గాల వారితో లోకేశ్ సమావేశాలు నిర్వహించి వారి సమస్యలను తెలుసుకుంటున్నారు. రైతులు,యువత,మహిళలు,ముస్లిం మైనారిటీలు, బీసీలు,ఎస్సీలు, ఎస్టీలు, వ్యాపారులు, ఐటీ ఉద్యోగులు, భవన నిర్మాణ కార్మికులు, న్యాయవాదులు, రవాణా రంగ ప్రతినిధులతో 132 సమావేశాలు నిర్వహించారు.కొన్ని సందర్భాల్లో కొన్ని స్పష్టమైన హామీలు కూడా ప్రకటించారు.కర్నూలులో ముస్లిం మైనారిటీలతో, కడపలో రాయలసీమ ప్రాంత మేధావులు, ప్రముఖులతో భేటీలు జరిపారు. కడపలో మిషన్ రాయలసీమ పేరుతో రాయలసీమ అభివృద్ధి వ్యూహాన్ని కూడా ప్రకటించారు. పాదయాత్రలో ప్రతి వంద కిలోమీటర్లకు లోకేశ్ శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తున్నారు. ఆ ప్రాంతంలో ఒక ప్రజా సమస్యను ఎంచుకుని దానిని పరిష్కరిస్తానని హామీ ఇస్తూ ఫలకాన్ని ఆవిష్కరిస్తున్నారు. ఇప్పటికి 27 శిలాఫలకాలు ఆవిష్కరించారు.
ఉమ్మడి జిల్లాల వారీగా చూస్తే చిత్తూరు జిల్లాలోని 14 నియోజకవర్గాల్లో 45 రోజులు, అనంతపురం జిల్లాలోని 9నియోజకవర్గాల్లో 23 రోజులు, కర్నూలు జిల్లాలోని 14నియోజకవర్గాల్లో 40రోజులు, కడప జిల్లాలోని 7నియోజకవర్గాల్లో 16 రోజులు, నెల్లూరు జిల్లాలోని పది నియోజకవర్గాల్లో 31 రోజులు, ప్రకాశం జిల్లాలోని 8నియోజకవర్గాల్లో 17రోజులు, గుంటూరు జిల్లాలోని 7 నియోజక వర్గాల్లో 16రోజులు, కృష్ణాజిల్లాలోని 6 నియోజకవర్గాల్లో 8 రోజులు, ఇప్పటి దాకా పశ్చిమగోదావరి జిల్లాలోని 2 నియోజకవర్గాల్లో నాలుగు రోజులపాటు ఆయన నడిచారు. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 577 కిలోమీటర్ల దూరం నడిచారు.
యువనేత లోకేష్ పాదయాత్ర పూలబాట కాదు..ఓ వైపు దాడులు..మరో వైపు సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారాలు.. శారీరక శ్రమ.. ఇలా అన్నింటినీ ఓర్చుకుని ప్రజల కోసం..పాదయాత్ర చేస్తున్నారు లోకేష్.అధికార పార్టీ అరాచకాలతో బెదిరిపోయిన పార్టీ శ్రేణులకు.. నేనేన్నా అంటూ అండగా నిలబడ్డారు. పారేసుకుంటేనే మాస్ లీడర్లు కాదని. స్టార్ ఫర్డ్ లో చదువుకున్న వారు కూడా.. మాస్ లీడర్లు అవుతారని.. నిరూపించుకున్నారు లోకేష్.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com