కాకినాడలో ప్రేమజంటకు పెళ్లి చేసిన పోలీసులు

కాకినాడలో ప్రేమజంటకు పెళ్లి చేసిన పోలీసులు

తూర్పుగోదావరి జిల్లా కాడినాడలో ఓ ప్రేమజంటకు పోలీసులు పెళ్లి చేశారు. కాకినాడకు చెందిన వినోద్‌కుమార్, సువర్ణ కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ఇద్దరు మేజర్లు కావడంతో.. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఐతే వీరి ప్రేమ పెళ్లికి కుటుంబ పెద్దలు అభ్యంతరం తెలపడంతో.. ప్రేమజంట పోలీసులను ఆశ్రయించారు. తమకు రక్షణ కల్పించాలని కాకినాడ టూ టౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ప్రేమజంటకు సంబంధిచిన ఇరువురి తల్లిదండ్రులను పిలిపించి కౌన్సింగ్‌ ఇచ్చారు. వారికి అవగాహన కల్పించారు. అనంతరం ప్రేమజంటకు పోలీసులు పెళ్లి చేశారు.

Tags

Read MoreRead Less
Next Story