మదనపల్లె హత్య కేసులో సంచలన విషయాలు!

మదనపల్లె హత్య కేసులో సంచలన విషయాలు!
సంచలనం సృష్టించిన మదనపల్లె హత్య కేసు రోజుకో మలుపు తిరుగుతుంది. తాంత్రిక పూజలకు అలేఖ్య అలవాటు పడ్డట్లు తెలుస్తోంది.

సంచలనం సృష్టించిన మదనపల్లె హత్య కేసు రోజుకో మలుపు తిరుగుతుంది. తాంత్రిక పూజలకు అలేఖ్య అలవాటు పడ్డట్లు తెలుస్తోంది. భోపాల్‌లో చేరినప్పట్నుంచి తాంత్రిక పూజలు ఎక్కువగా నమ్మేదని.. ఆ మూఢనమ్మకాలను తల్లిదండ్రులను నమ్మించినట్లు సమాచారం. హత్యలకు ప్రొత్సహించింది అలేఖ్య అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. అలేఖ్య మ్యాజిక్‌లు కూడా చేసేది. ఆమె గదిలో హర్రర్‌ పుస్తకాలు గుర్తించారు పోలీసులు. మ్యాజిక్‌లతో ఉన్నత విద్యావంతులైన తల్లిదండ్రులను నమ్మించి ఇంత దారుణానికి ఒడిగట్టిందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

అసలు హత్యకు పది రోజులు ముందు ఆ ఇంట్లో ఏమి జరిగిందనేది ప్రశ్నార్ధకం. సీసీ కెమెరాలలో కూడా దృశ్యాలు రికార్డ్‌ కాలేదు. బంధువులు మాత్రమే వచ్చి వెళ్లినట్టు గుర్తించామని పోలీసులు అంటున్నారు. ఆ పది రోజులు తాంత్రిక పూజలలో కుటుంబం నిమగ్నమైయిందా? అన్న అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. పాలు పోసే వాళ్లను కూడా రావద్దని చెప్పినట్లు సమాచారం. బంధువులు ఇంటికి వచ్చినా వెంటనే వెళ్లిపోవాలని అలేఖ్య కుటుంబం చెప్పినట్లు తెలుస్తోంది.

మూఢనమ్మకాలతో ఆ కుటుంబం చిన్నాభిన్నమైంది. కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి. నూతనంగా నిర్మించిన ఇంటికి వచ్చి ఏడాది కూడా కాలేదు. మూఢ భక్తితో నిండు ప్రాణాలు బలయ్యాయి. అలేఖ్య తన కుటుంబం మొత్తాన్ని హిప్నటైజ్‌ చేసింది. సాయి దివ్య నాలుకను కోసేయగా.. ఆ నాలుకను పద్మజ తినేసినట్లు నమ్మలేని నిజాలు బయటికొస్తున్నాయి. అటు.. జైల్లో ఉన్న పద్మజ పోలీసులు, ఖైదీలకు చుక్కలు చూపిస్తున్నట్లు తెలుస్తోంది. అరుపులతో జైలును హోరెత్తిస్తుంది.

Tags

Read MoreRead Less
Next Story