Maha Shiv Ratri: మహానందిలో శివరాత్రి బ్రహ్మోత్సవాలు షురూ
నేటి నుంచి 21వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు
నంద్యాల జిల్లాలోని ప్రముఖ శైవ క్షేత్రం మహానందిలో మహశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం అయ్యాయి. నేటి నుంచి 21వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తామని ఆలయ పూజారి రవిశంకర్ అవధాని తెలిపారు. బ్రహ్మోత్సవాల నేపథ్యంలో ఆలయాన్ని సుందరంగా అలంకరించారు. ఇక ఉదయం నుంచి స్వామి వారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇక ఉదయం ధ్వజారోహణతో ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు 21వ తేదీన అధ్వజ అవరోహణతో ముగుస్తాయని రవిశంకర్ వెల్లడించారు.
Next Story