గుంటూరులో సెల్ టవర్ ఎక్కి వ్యక్తి హల్‌చల్

X
గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం కాట్రపాడులో కలకలం రేగింది. శివరామకృష్ణయ్య అనే వ్యక్తి సెల్ టవర్ ఎక్కాడు. కాకానిలోని ఓ స్థలం విషయంలో తన కోడలు 5 లక్షలు ఇస్తానని ఒప్పుకొని.. ఇప్పుడు ఇవ్వడం లేదని వాపోయాడు. నాడు ఎస్పీ సమక్షంలోనే ఒప్పుకుందని వెల్లడించాడు. ఇప్పుడు డబ్బులు అడిగితే మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి వద్దకు వెళ్లి ఫోన్లు చేయించి బెదిరిస్తున్నారని ఆరోపించాడు. డబ్బులు ఇస్తామని పిలిచి సంతకాలు పెట్టించుకొని పొమ్మన్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. దీంతో టవరెక్కి న్యాయం చేయాలని వాపోయాడు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
