East Godavari : వైసీపీ నాయకుల వేధింపులు భరించలేక ఆత్మహత్యాయత్నం.. 5 లక్షలు డిమాండ్

East Godavari : తూర్పుగోదావరి జిల్లాలో అధికార నేతల వేధింపులు పెరుగుతున్నాయి. తాజాగా గోపాలపురం మండలం జగన్నాథపురంలో వైపీసీ నాయకుల వేధింపులతో ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.
కలుపు మందు తాగడంతో, ఇది గుర్తించిన కుటుంబ సభ్యులు వెంటనే అతన్ని గోపాలపురం ఆరోగ్య కేంద్రానికి, ఆ తర్వాత మెరుగైన వైద్య చికిత్స కోసం రాజమండ్రి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ విషయంపై బాధితుని కుమార్తె.. గోపాలపురం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
ఉచిత రేషన్ పంపిణీపై రేషన్ డీలర్ డ్రైవర్ ధన్‌రాజ్‌కు శ్రీనివాసరావుకు మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో శ్రీనివాసరావుపై ధన్‌రాజ్.. గోపాలపురం పోలీస్ స్టేషన్‌లో ఎస్సీ-ఎస్టీ అట్రాసిటీ కేసుపెట్టాడు.
ఈ కేసు నుంచి తనను కాపాడాలని గ్రామం పెద్దలను కోరగా.... రంగంలోకి దిగిన వైసీపీ నేత సుబ్రహ్మణ్యం, డీలర్ నాగేశ్వర్‌రావు, కొందరు నేతలు... 5 లక్షలు డిమాండ్ చేశారని, లేదంటే జైలుకు వెళ్లాల్సి ఉంటుందని బెదిరించారని శ్రీనివాసరావు వాపోయారు. డబ్బు విషయంలో అదే పనిగా వేధిస్తుండడంతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు శ్రీనివాసరావు తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com