పెళ్లైన 35 ఏళ్ల తరువాత ఆయనకు ఏమైంది.. భార్యని ఎందుకలా..

పెళ్లైన 35 ఏళ్ల తరువాత ఆయనకు ఏమైంది.. భార్యని ఎందుకలా..
పెళ్లై 35 ఏళ్లయింది. పిల్లలు పెరిగి పెద్దవాళ్లయ్యారు..

అనుమానం పెనుభూతం.. అన్నీ ఉన్నా అనుమానం ఉన్న వ్యక్తి భర్త/భార్యగా దొరికితే ఆ సంసారం నరక ప్రాయం. లేచిన దగ్గర్నుంచి ఏ పని చేసినా ఆ దృష్టితోనే చూస్తూ అరాచకం సృష్టిస్తారు.. పెళ్లై 35 ఏళ్లయింది. పిల్లలు పెరిగి పెద్దవాళ్లయ్యారు.. అయినా ఆయన అనుమానం వయసుతో పాటే పెరిగి వేళ్లూనుకుంది. ఫలితంగా భార్య బాడీ కాలువలో తేలింది. కడప జిల్లాలో ఈ దారుణ ఘటన వెలుగు చూసింది.

కాశినాయన మండలం చిన్నాయపల్లెకి చెందిన పుల్లారెడ్డికి బి.మఠం మండలానికి చెందిన నారాయణమ్మతో 35 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కూతుళ్లు, ఒక కొడుకు ఉన్నారు.ఇరవై ఏళ్లు కాపురం సాఫీగానే సాగింది. ఆ తరువాత కలహాలు, అనుమానాలతో రోజూ గొడవలు.. పదేళ్లుగా అది మరింత పెరుగుతూ వచ్చింది. దాన్నే మనసులో పెట్టుకుని ఆమెను అత్యంత కిరాతకంగా హత్య చేశాడు.. భార్య గొంతుకోసి చంపేసాడు.. అనంతరం మృతదేహాన్ని గోనెసంచిలో చుట్టి తెలుగు గంగ కాల్వలో పడేశాడు.

తల్లి కనిపించకపోవడంతో అనుమానం వచ్చిన కొడుకు వీరమోహన్ రెడ్డి పోలీసులను ఆశ్రయించడంతో తండ్రి చేసిన దారుణం బయటపడింది. అయితే భార్యను హత్య చేసిన అనంతరం పుల్లారెడ్డి స్టేషన్‌కి వెళ్లి లొంగిపోయినట్లు తెలుస్తోంది. కాల్వలో శవం సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించగా నారాయణమ్మ మృతదేహం అప్పటికే నానిపోయి పాడైపోయింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Tags

Next Story