దారుణం.. భార్యాభర్తల మధ్య ఘర్షణలో ఓ వ్యక్తి తలదూర్చడంతో..

దారుణం.. భార్యాభర్తల మధ్య ఘర్షణలో ఓ వ్యక్తి తలదూర్చడంతో..

కర్నూలు జిల్లా నంద్యాలలో దారుణం జరిగింది. భార్య, భర్తల మధ్య జరిగిన ఘర్షణలో ఓ మధ్యవర్తి తలదూర్చడంతో ఒకరు మృత్యువాతపడ్డారు. పట్టణంలోని నందమూరి నగర్‌లో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. తన భర్తకు మృతికి కారణమైన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది.


ఓబులేసు అనే వ్యక్తి మద్యం మత్తులో తన భార్య రమాదేవి, కూతురు కావ్యతో గొడవపడ్డాడు. ఈ క్రమంలో అదే కాలనీకి చెందిన ఉప్పు బాషా అనే వ్యక్తి మధ్యలో తలదూర్చాడు. ఓబులేసు, ఉప్పుబాషా మధ్య మాటామాటా పెరిగి తీవ్ర ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో ఉప్పుబాషా.. బలంగా తోయడంతో ఓబులేసు కిందపడ్డాడు. అప్పటికే గాయపడి అపస్మారకస్థితిలో ఉన్న ఓబులేసును.. బాషా కాళ్లతో తన్నడంవల్లే మరణించాడని భార్య రమాదేవి ఆరోపిస్తోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story