జగన్‌ సర్కార్‌పై ఉద్యమానికి ఉన్నత విద్యాసంస్థల యాజమాన్యాలు సిద్ధం

జగన్‌ సర్కార్‌పై ఉద్యమానికి ఉన్నత విద్యాసంస్థల యాజమాన్యాలు సిద్ధం
ఇప్పటికే ఫీజుల నిర్ణయంపై ఉన్నత విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ కార్యాలయాన్ని ముట్టడించాయి

ఉన్నత విద్యలో జగన్ సర్కారు అవలంభిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా ప్రైవేటు డిగ్రీ కళాశాలల యాజమాన్యాలు ఉద్యమానికి సిద్ధమయ్యాయి. ఇప్పటికే ఫీజుల నిర్ణయంపై ఉన్నత విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ కార్యాలయాన్ని ముట్టడించాయి. ఇటీవల గ్రేటర్ రాయలసీమ పేరుతో కడపలో సమావేశం నిర్వహించాయి. ఇప్పుడు ఉత్తరాంధ్ర రీజియన్‌కు సంబధించి వచ్చే నెల 10న విశాఖలో భారీ సభ నిర్వహించేందుకు రెడీ అవుతున్నాయి. అనంతరం.. విజయవాడలో మరో సదస్సుకు, ధర్నా నిర్వహించాలని నిర్ణయించాయి.

జగన్ సర్కారు విధానాలతో ప్రైవేటు, డిగ్రీ కళాశాలలో తీవ్రంగా నష్టపోయాయంటున్నాయి ప్రైవేటు యాజమాన్యాలు. గ్రామీణ విధానాలతో తక్కువ ఫీజుతో నిర్వహిస్తున్న విద్యాసంస్థలను ప్రభుత్వం సర్వనాశం చేస్తోందంటంటూ ఆరోపిస్తున్నాయి. గత టీడీపీ ప్రభుత్వ హాయంలో ప్రైవేటు కళాశాలల ఫీజులను ఆయా విశ్వవిద్యాలయాలు నిర్ణయించేవి. వీటిని రాష్ట్ర ప్రభుత్వం చెల్లించేది. కానీ వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఫీజుల భారాన్ని తగ్గించుకునేందుకు డిగ్రీ కళాశాలలను ఉన్నత విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ కిందకు తీసుకొచ్చిందని విమర్శిస్తున్నాయి ప్రైవేటు యాజమాన్యాలు.

Tags

Read MoreRead Less
Next Story