MANCHU MANOJ: జనసేనలోకి మంచు మనోజ్..!

MANCHU MANOJ: జనసేనలోకి మంచు మనోజ్..!
X

సినీ నటుడు మంచు మనోజ్‌ రాజకీయ రంగ ప్రవేశం చేయబోతున్నారంటూ జరుగుతున్న ప్రచారానికి తెరపడింది. ఆయన జనసేనలో చేరబోతున్నారంటూ సామాజిక మాధ్యమాల వేదికగా వార్తలు వైరల్‌ అయ్యాయి. దీనిపై మంచు మనోజ్ స్పష్టత ఇచ్చారు. ప్రస్తుతానికి ఏమీ మాట్లాడలేనని వెల్లడించారు. మనోజ్ వెయ్యి కార్లతో ర్యాలీ, జనసేనలో చేరుతున్నట్లు ప్రకటన చేయనున్నారనే ప్రచారం మాత్రం సోషల్ మీడియా సృష్టించిన కథేనని తేలిపోయింది. మంచు మనోజ్ను ‘‘ఏంటి మీరు జనసేనలో చేరుతున్నారట కదా.. నిజమేనా..?’’ అని ఇదే విషయాన్ని మీడియా అడగ్గా.. ‘నో కామెంట్’ అని మనోజ్ సైలెంట్గా సైడైపోయాడు.

నో చెప్పలేదు..

అయితే మంచు మనోజ్, ఆయన భార్య మౌనిక రెడ్డి జనసేన లేదా టీడీపీలో చేరే అవకాశం ఉందని జోరుగా ప్రచారం జరుగుతోంది. మనోజ్, మౌనిక తమ రాజకీయ ప్రస్థానం ప్రారంభించేందుకు నంద్యాల నుంచి ముందుకు వస్తారని కూడా ప్రచారం చేశారు. ఇటీవల మంచు కుటుంబంలో చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో, రాజకీయంగా బలపడాలనే ఆశతో ఈ దంపతులు రాజకీయాల వైపు అడుగులు వేసినట్లు తెలుస్తోంది. రాజకీయ ప్రయాణం కోసం వారు ఓ పార్టీలో చేరాలని భావిస్తున్నారని, రాజకీయంగా బలపడితే తమకు కొంత భరోసా దొరుకుతుందని మనోజ్ భావిస్తున్నట్లు సమాచారం. ఔనని గానీ, కాదని గానీ కన్ఫర్మేషన్ ఇవ్వలేదు. జనసేనలో చేరుతుండొచ్చేమో గానీ అంత హంగామా చేస్తూ జాయిన్ అవడానికి మనోజ్ రాజకీయ పార్టీల్లో యాక్టివ్గా ఉన్న వ్యక్తి కానే కాదు.

Tags

Next Story