VISHNU: మంచు విష్ణు.. మంచి మనసు

సినీ నటుడు మంచు విష్ణు మరోసారి మంచి మనసు చాటుకున్నాడు. పహల్గామ్ ఉగ్రదాడిలో 26 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఇందులో ఇద్దరు ఏపీ వాసులు కూడా ఉన్నారు. నెల్లూరు జిల్లా కావలికి చెందిన మధు సూధన్ కూడా ఉగ్ర తూటాలకు బలయ్యారు. ఇప్పటికే మధుసూదన్ కుటుంబాన్ని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తో పాటు పలువురు సినీ, రాజకీయ నాయకులు కలిసి పరామర్శించారు. తాజాగా మా అధ్యక్షుడు, హీరో మంచు విష్ణు... మధుసూదన్ కుటుంబాన్ని కలిసి పరామర్శించాడు. నెల్లూరు జిల్లా కావలి వెళ్లిన మంచు విష్ణు.. మధుసూదన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించాడు. మధుసూదన్ సతీమణి కామాక్షి, పిల్లలకు ధైర్యం చెప్పాడు. అనంతరం మంచు విష్ణు కీలక ప్రకటన చేశాడు. మధు సూదన్ పిల్లల బాధ్యతను తాను తీసుకుంటానని, వారిని దత్తత తీసుకుని చదువుకు కావాల్సిన సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చాడు. మధుసూదన్ గత 12 సంవత్సరాలుగా బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు. ఆయన తల్లిదండ్రులు తిరుపాలు, పద్మావతి, కావలిలో అరటి పండ్ల వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఇప్పటికే మంచు విష్ణు తిరుపతిలో 120 మంది అనాథ పిల్లలను దత్తత తీసుకుని వారి ఆలనా పాలనా చూసుకుంటున్నాడు. ఇప్పుడు పహల్గామ్ దాడి బాధిత కుటుంబానికి కూడా దత్తత తీసుకుంటామని ప్రకటించడంపై అభిమానులు, నెటిజన్లు మంచు విష్ణుపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
కన్నప్ప టీమ్ హర్ట్ అయిందా..?
టాలీవుడ్ యంగ్ హీరో శ్రీ విష్ణు ప్రధాన పాత్రలో సింగిల్ అనే మూవీ రూపొందుతుంది. ట్రైలర్‌లో నవ్వులు పూయించారు. అయితే, కామెడీ ట్రాక్‌లో సాగే కొన్ని డైలాగ్స్ ఇప్పుడు వివాదాస్పదం అయ్యాయి. ట్రైలర్‌లో.. శ్రీవిష్ణు ‘శివయ్యా..’ అని అరుస్తూ ఉండడంపై విష్ణు అసంతృప్తిగా ఉన్నారనే టాక్ వినిపించింది. అందుకు కారణం మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప టీజర్‌లో ఆయన శివయ్య అని గట్టిగా అరిచారు. దానిపై తెగ ట్రోలింగ్ నడిచింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com