మాన్సాస్ ట్రస్ట్‌లో మరోసారి వివాదాస్పద నిర్ణయం

ఇప్పటికే అనేక వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్న విజయనగరం మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్ సంచైత గజపతిరాజు.. మరోసారి కీలక నిర్ణయం తీసుకుని.. వార్తల్లో నిలుస్తున్నారు. విజయనగరంలోని మాన్సాస్ ట్రస్ట్ కార్యాలయాన్ని.. విశాఖలోని పద్మనాభం గ్రామానికి మార్చాలని.. సంచైత గజపతి ఆదేశాలు జారీ చేయడం కలకలం రేపుతోంది. సీఎం జగన్ తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయానికి మద్దతుగా సంచైత కూడ.. తనవంతుగా అమలు చేస్తున్నట్టు తెలుస్తోంది. మూడు ప్రాంతాల్లో మాన్సాస్ కార్యాలయాలు ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్టు ఊహాగానాలు తెరపైకి వస్తున్నాయి.
కోటతోపాటు.. మహారాజా ఇంజినీరింగ్ కాలేజీ, ఇంటర్ కాలేజ్‌కు సంబందించి మూడు చోట్ల కార్యాలయాలు ఉండేలా సంచైత చర్యలు తీసుకుంటున్నారు. అయితే.. అకౌంట్స్‌కు సంబంధించిన కార్యాలయాన్ని.. విశాఖకు తరలిస్తే.. రైతులు ఇబ్బంది పడే అవకాశం ఉంది. ప్రతిఏటా భూమి పన్ను కట్టేందుకు రైతులు మాన్సాస్ కార్యాలయానికి వెళుతుంటారు. ఇప్పుడు ఆఫీస్‌ను విశాఖకు మార్చితే... పన్ను కట్టేందుకు రైతులు విశాఖ వెళ్లాల్సి ఉంటుంది. సంచైత తాజా నిర్ణయంపై... మాన్సస్ సభ్యురాలు అధితి గజపతిరాజు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com